Imandi Ramarao : గత కొన్నిరోజులుగా అల్లు అరవింద్ కుటుంబంలో విభేదాలు ఉన్నాయంటూ వార్తలొస్తున్నా దీని మీద అల్లు ఫ్యామిలీ నుండి ఎవరూ స్పందించలేదు. అల్లు అర్జున్ మీద తమ్ముడు శిరీష్ అలిగాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే శిరీష్ కుటుంబంతో లేకుండా ముంబై వెళ్ళిపోయాడు అంటూ కథలు అల్లేస్తున్నారు. కానీ నిజాలు బయటికి తెలియకపోయినా వినాయక చవితి పండుగా నాడు కుటుంబ సభ్యులందరూ ఉన్నా అల్లు శిరీష్ కుటుంబంతో లేకపోవడంతో మరోసారి ఈ ఇష్యూ లో అనుమానాలు వచ్చాయి.

బన్నీ పై అల్లు శిరీష్ అలక…
ఇక ఈ విషయాలపై సీనియర్ జర్నలిస్ట్ ఇమంది విశ్లేషిస్తూ కొడుకులు ముగ్గురి ఉన్నతిని చూడాల్సిన బాధ్యత అల్లు అరవింద్ మీద ఉంది. ఎందుకో ఆయన బన్నీ మీద పెట్టిన శ్రద్ధ శిరీష్ మీద పెట్టలేదని అనిపిస్తుంది అంటూ అభిప్రాయ పడ్డారు. ఇక శిరీష్ కథల ఎంపిక సరిగా లేకపోవడం కూడా కారణం. మెగా ఫ్యామిలీ లో అందరు హీరోలు ఎవరికి వారు సొంత ఫ్యాన్ బేస్ ను ఏర్పాటు చేసుకున్నారు. అలా శిరీష్ చేసుకోలేక పోయాడు అంటూ అన్నారు.

ఇక ఖాళీగా అలిగి ముంబై వెళ్ళలేదు శిరీష్, అక్కడ ఉండి బాలీవుడ్ లో ప్రయత్నిస్తూ అలాగే కన్నడ, తమిళ ఇండస్ట్రీ లలో ఏవైనా మంచి సినిమా ఆఫర్స్ వస్తే చేయాలనే ఉద్దేశంతో వెళ్లినట్లు తెలుస్తోంది. శిరీష్ చాలా తెలివైన వాడు, వ్యాపారం లో చాలా మంచి నేర్పరి కానీ నటనలో మాత్రం నెగ్గలేదు. ప్రతిదీ చక్కగా ప్లాన్ చేసే అల్లు అరవింద్ గారు శిరీష్ కెరీర్ పట్టించుకుని ఉంటే బాగుండేది అంటూ ఇమంది రామారావు అభిప్రాయపడ్డారు.































