తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ కీలక ప్రకటన విడుదల చేసింది. మార్చి 3న జరిగే చంద్రగ్రహణం నేపథ్యంలో పలు సేవల్లో మార్పులు ఉంటాయని స్పష్టం చేసింది. ముఖ్యంగా, భక్తులకు అందించే ఉచిత అన్నప్రసాద వితరణను ఆ రోజు తాత్కాలికంగా నిలిపివేయనున్నారు.

ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయ ద్వారాలు మూసివేయడం సంప్రదాయంగా కొనసాగుతోంది. గ్రహణం సమయానికి ముందు నుంచే ఆలయం మూసి, అనంతరం శుద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారు. రాత్రి తర్వాత మాత్రమే భక్తులకు దర్శనం అనుమతిస్తారు.
ఇదే సమయంలో, తిరుపతి మరియు తిరుచానూరులోని అన్నప్రసాద కేంద్రాలు కూడా మూసివేయబడతాయి. భక్తులు అసౌకర్యానికి గురికాకుండా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచించారు.
అయితే ఆస్పత్రుల్లో ఉన్న రోగులకు, వారి సంరక్షకులకు మాత్రం ముందుగానే అన్నప్రసాదం అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ వెల్లడించింది.
చంద్రగ్రహణం రోజు తిరుమలకు వచ్చే భక్తులు ఈ మార్పులను దృష్టిలో పెట్టుకుని ప్రయాణం ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.




























