Indhu Anandh : తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అటు సినిమాలు ఇటు సీరియల్స్ లో నటిస్తున్న నటి ఇందు ఆనంద్. చక్రవాకం, మొగలిరేకులు, కళ్యాణ వైభోగమే వంటి సీరియల్స్ తో బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకున్న ఇందు ఆనంద్ సినిమాల్లోను చేసిన కొన్ని వాటిలోనే గుర్తింపు ఉన్న పాత్రలను ఎంచుకున్నారు. ఎక్కువగా పవన్ కళ్యాణ్ సినిమాల్లో మంచి పాత్రలను చేసిన ఇందు ప్రస్తుతం గమనం, బుడుగు వంటి చిత్రాల్లో నటించారు. రెమ్యూనరేషన్ గురించి ఏరోజు డిమాండ్ చేయలేదని, ఒక సంస్థతో పనిచేసాక మళ్ళీ అదే సంస్థ తో పనిచేయడానికి ఇష్టపడుతానని, కళ్యాణ వైభోగమే టీంతో నాలుగున్నరేళ్లు పని చేశాను మళ్ళీ వాళ్ళతోనే కళ్యాణం కమనీయం లో చేస్తున్నాను అలాగని ఎక్కువ పారితోషకం ఇవ్వమని అడగలేదు అని చెప్పారు ఇందు.

నా కూతురు నా కన్నా ముందే చనిపోవాలి…
వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ ఇందు ఆనంద్ తన కూతురు గురించి చెప్పారు. తాను మూడు పెద్ద సర్జరీలు చేయించుకోవాల్సి వచ్చిందని కానీ ఈ వయసులో కూడా కష్టపడుతూ పనిచేయడానికి కారణం కూతురు ని రాయల్ గా చూసుకోవడం కోసమే అని ఇందు చెప్పారు. తాను పుట్టినప్పటి నుండి ఇప్పటివరకు తనకు ఏ లోటు లేకుండా పెంచానని, అందుకే తనకోసం ఈ వయసులోనూ కస్టపడుతున్నట్లు చెప్పారు. ఇందు కుమార్తె కు మానసిక ఎదుగుదల, ఆరోగ్య సమస్యలు ఉండడం వల్ల చిన్నపిల్ల గానే ఉండిపోయారు.

అందుకే తన కూతురిని పెంచడం ఎప్పుడూ భారంగా, బాధగా అనుకోలేదని శాశ్వతంగా ఒక చిన్నపాపను నేను సాకుతున్నానని ఆనందంగా ఉంటుందని చెప్పారు. ఇక నాకు ఏదైనా కోరిక్ ఉంది అంటే అది నా కూతురు నేను బ్రతికుండగానే చనిపోవాలి అని కోరుకుంటాను అంటూ ఎవరూ బహుశా ఇలా కోరుకోరు కానీ ఇంకొకరికి నా కురురు ని పెంచడం భారం కాకూడదని అలా అనుకుంటున్నాను. నా భర్త చనిపోయాక నా బిడ్డను అన్ని నేనే అయి పెంచాను. ఇప్పటికీ తన కోసం కస్టపడుతున్నాను. కానీ నా తరువాత తనను చూసుకోవడానికి మరొకరు ఇబ్బంది పడకూడదు అంటూ చెప్పారు ఇందు ఆనంద్.



























