Indravathi Chauhan : పుష్ప సినిమా అంత ఒక ఎత్తు అయితే సినిమాలో ఊ అంటావా పాట మరో ఎత్తు. మొత్తం దేశాన్నే ఈ పాట ఊపేసిందంటే అతిశయోక్తి కాదేమో. సమంత అందాలు, డాన్స్ ఎంత ఆకట్టుకున్నాయో, గాయని గాత్రం కూడా అంతలా ఆకట్టుకుంది. తెలుగులో ఈ పాటను ఫేమస్ సింగర్ మంగ్లీ చెల్లెలు ఇంద్రావతి చౌహన్ పాడారు. శ్రావ్యమైన గొంతుతో హావభావలను మత్తుగా పలికించి ఈ పాటకు మరింత అందాన్ని తెచ్చింది ఇంద్రావతి.

ఫోటోషూట్ తో అదరగొడుతున్న ఇంద్రావతి….
ఇక ఈ పాట ఎంత సంచలనమో అందరికి తెలుసు. సాధారణ జనం నుండి, సెలబ్రిటీల వరకు అందరు ఈ పాటకు ఊగిపోయారు. ఇక యూట్యూబ్ లో ఎక్కువమంది వీక్షించిన పాటగా గ్లోబ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకుంది ఈ పాట. ఇక చాలా మంది ఈ పాటను యూట్యూబ్ రీల్స్ కూడా చేసేసారు. ఈ పాట తరువాత ఇంద్రావతి ఓవర్ నైట్ స్టార్ సింగర్ అయిపోయింది. ఇపుడు తెలుగే కాకుండా ఇతర భాషలనుండి కూడా అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి.
సోషల్ మీడియాలో చురుకుగా ఉండే ఇంద్రావతి తనకు సంబంధించిన అప్ డేట్స్ ను తన ఇంస్టాగ్రామ్ లో అభిమానులతో షేర్ చేస్తుంటుంది. అలానే ఇప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసి అభిమానులను ఫిదా చేస్తోంది. ఈ ఫోటోలు ఇపుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇపుడు ఇంద్రావతి కి క్రేజ్ తెచ్చిన ఈపాట తొలుత తన అక్క మంగ్లీ పాడాల్సింది అయితే తనతో పాటు ఇంద్రావతి ని తీసుకెళ్లడం సుకుమార్ కి ఆమె గాత్రం నచ్చడంతో ఆమెతో తెలుగులో పాట పాడించారు.
































