Indu Anand : సుమ వాళ్ళ అమ్మ నేను అక్కాచెల్లెళ్లం… కానీ సుమ నేను ఎపుడూ మాట్లాడుకోలేదు…: ఇందు ఆనంద్

0
233

Indu Anand : తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అటు సినిమాలు ఇటు సీరియల్స్ లో నటిస్తున్న నటి ఇందు ఆనంద్. చక్రవాకం, మొగలిరేకులు, కళ్యాణ వైభోగమే వంటి సీరియల్స్ తో బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకున్న ఇందు ఆనంద్ సినిమాల్లోను చేసిన కొన్ని వాటిలోనే గుర్తింపు ఉన్న పాత్రలను ఎంచుకున్నారు. ఎక్కువగా పవన్ కళ్యాణ్ సినిమాల్లో మంచి పాత్రలను చేసిన ఇందు ప్రస్తుతం గమనం, బుడుగు వంటి చిత్రాల్లో నటించారు. నటనలోకి రావాలనే ఆసక్తి లేకపోయినా ప్రయత్నం చేయకపోయినా అలా ఇండస్ట్రీలోకి వచ్చేసానని ఇందు చెప్పారు. ఇక హావభవాలు చాలా సహజంగా ఉంటాయని అందరూ చెబుతుంటారని, స్వతహాగా మళయాళి అవ్వడం వల్ల అలా మొహంలో అభినయం చక్కగా పలుకుతుందేమో అంటూ చెప్పారు.

సుమ నేను దగ్గరి బంధువులం…

ఇక కేరళకు చెందిన ఇందు ఆనంద్ పెరిగింది చదువుకున్నదంతా మాత్రం నార్త్ లోనే. ఢిల్లీ, బొంబాయి, లక్నో ఎక్కువగా ఉండటం వల్ల హిందీ ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పారు. రైతు కుటుంబమే అయినా తండ్రి మిలిటరీలో పనిచేయడం వల్ల నార్త్ లో ఎక్కువగా ఉండి అక్కడి ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పరు. అయితే కేరళలో ఎక్కువగా ఉండటానికి తన తండ్రి ఇష్టపడే వాడని, అందువల్ల సెలవుల్లో ఎక్కువగా పాలక్కాడ్ లోనే గడిపేవాళ్ళమని చెప్పారు ఇందు. ఇక యాంకర్ సుమ కూడా మలయాళి అందునా ఆమె ఇందు గారికి బంధువు. ఇక ఆ విషయం మాట్లాడుతూ సుమ వాళ్ళ అమ్మ నాకు అక్క అవుతారు, అమ్మ వైపు నుండి, నాన్న వైపు నుండి సుమ మాకు రిలెటివ్ అని చెప్పారు.

సుమ వాళ్ళ అమ్మ, మా నాన్న వాళ్ళ సోదరుడి భార్య అంటే మా పిన్ని ఇద్దరూ సొంత అక్కా చెల్లెల్లు అలా మాకు సుమ బంధువు అవుతుంది అంటూ చెప్పారు. ఇక అమ్మ తరుపున కూడా బంధువే, సుమ వాళ్ళ నాన్న ఇంటి పేరు పులోటా, మా పెద్దమ్మ అంటే అమ్మ వాళ్ల అక్కను పులోటా ఇంటికే ఇచ్చాము అలా కూడా మాకు బంధువు అవుతారు అంటూ చెప్పారు ఇందు. అయితే సుమ నేను చాలా తక్కువగా కలుస్తుంటాము మాట్లాడుతుంటాము. రాజీవ్ కనకాల చెల్లెలు చనిపోయినపుడు ఆమెతో పనిచేసిన అనుబంధం ఉంది అందుకే ఫోన్ చేసి సుమతో మాట్లాడాను అంతే, ఎపుడైనా కలిస్తే మాట్లాడటమే తప్ప అదేపనిగా మాట్లాడటం ఉండదు అంటూ చెప్పారు.