న్యాయం కావాలి సినిమా తో తెలుగు తెరకు పరిచయమైనా హీరోయిన్ ఎవరో మనందరికీ తెలుసు. రాధిక ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణ, చిరంజీవి లాంటి హీరోలతో నటించింది. ఆమె చెల్లెలు హీరోయిన్ నిరోషా తెలుగులో స్ట్రైట్ సినిమాలు అయినా, బాలకృష్ణతో నారీ నారీ నడుమ మురారి, చిరంజీవితో స్టువర్టుపురం పోలీస్ స్టేషన్ లాంటి చిత్రాల్లో నటించింది. తమిళం లో నుంచి తెలుగులోకి డబ్బైన ఘర్షణ చిత్రంలో నిరోషా నటించింది.

ఇంకా చెప్పాలి అంటే 1980 దశకంలో దూరదర్శన్ లో చిత్రలహరిలో ఒక “బృందావనం సోయగం..” అనే స్విమ్మింగ్ పూల్ పాటని గుర్తు చేసుకుంటే నిరోష ఎవరో తెలుస్తుంది. అయితే 1988లో ప్రముఖ తమిళ దర్శకుడు దేవరాజ్ దర్శకత్వంలో “సింధూరపూవే”అనే తమిళ చిత్రాన్ని 1989 లో తెలుగు లోకి సింధూరపువ్వు గా అనువదించారు. ఇక్కడ ఆ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ సినిమా విడుదలైన తర్వాత దూరదర్శన్ చిత్రలహరి లో సింధూర పువ్వా..నీవే చిందించరావా.. అనే పాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

అయితే సినిమాలోని ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ సినిమాకు సంబంధించి హీరోయిన్ ఎంపిక లో భాగంగా రాధిక చెల్లెల్ని నిరోషని దర్శకుడు దేవరాజు సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ ఫోటోలోని నిరోషా ను, రాంకీ చూపించినప్పుడు నిరోష ఫోటో ని పట్టుకొని ఈమె ఏంటి పని మనిషి లా ఉందని అన్నారు. కట్ చేస్తే… చివరికి నిరోష నే తమిళ “సింధూరపూవే” సినిమాలో సెలెక్ట్ చేయడం జరిగింది. అలా రాంకీ నిరోష లు కలిసి నటించిన ఈ చిత్రం తెలుగులో బ్లాక్ బస్టర్ అయింది. ఆ తర్వాత వీరు తమిళంలో 7 శతదినోత్సవ చిత్రాల్లో కలిసి నటించారు. ఒకరినొకరు బాగా అర్థం చేసుకొని చివరికి పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే ఈ మధ్య కాలంలో రాంకీ RX100 చిత్రంలో నటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here