ఒక ప్రాంతానికి మరొక ప్రాంతానికి ఒక దేశానికి మరొక దేశానికి సంస్కృతిలో కానీ జీవన విధానంలో కానీ వైవిధ్యం ఉంటుందనే సంగతి తెలిసిందే. అయితే ఇతర దేశాలతో పోలిస్తే ఉత్తర కొరియాలోని నియమ నిబంధనలు, ఆ దేశ అధినేత కిమ్ వైఖరి, కిమ్ తీసుకునే నిర్ణయాలు చిత్రవిచిత్రంగా ఉంటాయి. దేశ అధినేత కిమ్ చనిపోతే బాగుంటుందని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారంటే అక్కడ ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో సులభంగానే అర్థమవుతుంది.

సాధారణంగా అగ్ర రాజ్యం అమెరికా అంటే ఇతర దేశాలు గజగజా వణికిపోతాయి. కానీ కిమ్ పేరు చెబితే అమెరికా సైతం గజగజా వణకాల్సిందే. కిమ్ ఆగడాలు తెలిస్తే ఆ దేశంలో మాత్రం పుట్టకూడదని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కిమ్ మాత్రమే కాదు అతడి కుటుంబం వైఖరి కూడా అదే విధంగా ఉంటుంది. ఎవరైతే ఎదురు తిరిగి మాట్లాడితే వాళ్లు సొంతవాళ్లైనా మరణ దండననే శిక్షగా విధిస్తారు.

ప్రపంచ దేశాలు టెక్నాలజీ సహాయంతో వేగంగా ముందడుగులు వేస్తుంటే ఉత్తర కొరియాలో మాత్రం ఇంటర్నెట్ కూడా ఉండదు. అక్కడ పేదలకు ఫోటోలు తీయకూడదని… ఫోన్లు వాడకూడదని నిబంధనలు ఉన్నాయి. ఆ దేశంలో కేవలం మూడంటే మూడు ఛానెళ్లు మాత్రమే ప్రసారమవుతాయి. మనం ఉత్తరకొరియాకు వెళ్లామంటే కొత్త గ్రహానికి వెళ్లిన అనుభవం కలుగుతుంది.

ఉత్తరకొరియా దేశంలో పని చేసే వాళ్లకు సెలవు దినాలే ఉండవు. దేశాధినేత కిమ్ తాను కారణ జన్ముడినని ప్రజలకు చెప్పుకుంటూ ఉంటాడు. ప్రపంచమంతా ప్రస్తుతం 2020 సంవత్సరం నడుస్తోంటే ఉత్తర కొరియాలో మాత్రం కిమ్-2 సంగ్ క్యాలెండర్ ప్రకారం 107వ సంవత్సరం నడుస్తోంది. ఈ దేశంలో పోర్న్ చూసినా, బైబిల్ చదివినా మరణ శిక్ష తప్పదు. కిమ్ తండ్రి, తాత చనిపోయిన జులై 8, డిసెంబరు 17 తేదీల్లో ఎలాంటి వేడుకలు నిర్వహించకూడదు. వీఐపీలకు మాత్రమే అక్కడ ఇంటర్నెట్ అందుబాటులో ఉంటుంది. ఇక్కడ ఒక వ్యక్తి నేరం చేస్తే అతని తర్వాతి తరాలు కూడా శిక్షను అనుభవించాలి. 2000 మంది మహిళలతో ప్రత్యేకంగా ‘ప్లెజర్ స్క్వాడ్’ను ఏర్పాటు చేసుకుని కిమ్ వారితో తన కోరికలను తీర్చుకుంటాడు.