Venu Swamy: వేణు స్వామి ప్రముఖ జ్యోతిష్యులుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఈయన గత కొంతకాలం నుంచి జ్యోతిష్యం చెబుతూ ఉన్నప్పటికీ ఇటీవల కాలంలో బాగా ఫేమస్ అయ్యారు. ఈయన సమంత నాగచైతన్య విషయంలో చెప్పినటువంటి జాతకం ఎప్పుడైతే నిజమైందో అప్పటినుంచి వేణు స్వామి జాతకాలను నమ్మే వారి సంఖ్య ఎక్కువగా అయ్యింది.
ఇకపోతే వేణు స్వామి చెప్పే జాతకాలు ఇటీవల కాలంలో నిజం కావడం లేదు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ విషయంలోనూ అలాగే హీరో ప్రభాస్ సలార్ సినిమా విషయంలో ఈయన జాతకాలు తప్పవడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఈయనపై విమర్శలు కురిపిస్తున్నారు. ఇలా విమర్శల పాలవుతున్నటువంటి వేణు స్వామి యధావిధిగాని సెలబ్రిటీల జాతకాలని చెబుతూ వార్తలలో నిలుస్తున్నారు.
ఇక ఎంతోమంది సినీ సెలబ్రిటీలు ఈయన చేత జాతకాలు చెప్పించుకోవడమే కాకుండా జాతక పరిహారాలను కూడా చేయించుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా వేణు స్వామి చేత జాతకం చెప్పించుకోవాలన్న లేదంటే పూజ చేయించుకోవాలన్న భారీ మొత్తంలోనే ఆయనకు డబ్బు చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తుంది. ఇలా ఈయన గంటకు దాదాపు 5వేల రూపాయల వరకు డబ్బు తీసుకుంటారంటూ తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది.
పబ్ మెయిన్ బిజినెస్..
ఇలా ఈయన చేత పూజలు చేయించుకున్న వారు గంటకు ఇంత మొత్తంలో డబ్బు చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తుంది. అయితే వేణు స్వామికి జాతకాలు చెప్పడం అనేది కేవలం సైడ్ బిజినెస్ మాత్రమే నట ఈయన అసలు బిజినెస్ పబ్ నడపడం అని తెలుస్తుంది. ఇక ఈ విషయాన్ని కూడా వేణు స్వామి ఎన్నో సందర్భాలలో తెలియజేశారు తన జాతకం ప్రకారం తనకు ఈ రంగం అయితేనే కలిసి వస్తుందని అందుకే తాను అటువైపు వెళ్ళాను అంటూ వేణు స్వామి వెల్లడించారు.
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…