Categories: FeaturedMovie News

నటి ఊర్వశి తమ్ముడు 17 ఏళ్లకే అడల్ట్ మూవీలో నటించి.. చిన్న వయసులోనే చనిపోయాడని మీకు తెలుసా.?!

1980 దశకంలో ఊర్వశి తన నటనతో సినీ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. రంభ, ఊర్వశి, మేనక లాంటి చూడచక్కని రూపం. కేరళ రాష్ట్రం తిరువనంతపురంలో నాటకరంగంలో పేరు పొందిన VP నాయర్, విజయలక్ష్మిలకు 1971, జనవరి 25న ఊర్వశి జన్మించారు. ఆమెకు కళారంజని, కల్పన అనే ఇద్దరు అక్కయ్యలు కూడా ఉన్నారు. అలాగే కమల్ రాయ్, నందు అనే ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. ఆమె తిరువనంతపురంలో లో తొమ్మిదో తరగతి చదువుతున్న సమయంలో కుటుంబంతో సహా చెన్నైకి షిఫ్ట్ కావడం జరిగింది. ఊర్వశి తన ఎనిమిది సంవత్సరాల వయసులోనే బాలనటిగా సినిమాల్లో అవకాశం రావడం జరిగింది.

ఊర్వశి బాలనటిగా 1977లో విడరున్న మొటుకల్ అనే మలయాళ చిత్రంలో నటించింది. ఆ తర్వాత 13 సంవత్సరాల వయసులో “తొడురమ్ ఉరవ్” అనే చిత్రంలో కార్తీక్ సరసన హీరోయిన్ గా నటించింది. ఊర్వశి సినిమాల్లో బిజీగా ఉండడంతో చదువు మధ్యలోనే ఆపేసింది. ఆమె నటించిన మూడు మలయాళ చిత్రాలు పర్ఫామెన్స్ ఆధారంగా భాగ్యరాజా “ముంథనైముచి” అనే చిత్రంలో బుక్ చేసుకోవడం జరిగింది. ఆ చిత్రం సూపర్ డూపర్ హిట్ కావడంతో ఊర్వశికి మరిన్ని అవకాశాలు వచ్చాయి.

తెలుగులో(1984) మొదటిసారిగా రుస్తుం చిత్రంతో మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్ గా నటించింది ఆ తర్వాత అమ్మాయిలు ప్రేమించండి, కాలరుద్రుడు, ఉద్దండుడు, జీవన పోరాటం, అంతిమ తీర్పు, చెట్టు కింద ప్లీడర్, సైజ్ జీరో, చక్రం, సర్దార్ గబ్బర్ సింగ్, ఉలవచారు లాంటి చిత్రాల్లో నటించింది. ఇలా నటిస్తున్న క్రమంలో లో ప్రముఖ సినిమా నటుడు అయిన మనోజ్ కె వివాహం చేసుకుంది 2001లో వీరికి ఒక కూతురు జన్మించింది. కొన్ని సంవత్సరాలు వీరి కాపురం సజావుగా జరిగినప్పటికీ ఆ తర్వాత విడాకులు తీసుకొని 2008లో రియల్ ఎస్టేట్ బిల్డర్ శివప్రసాద్ ను తిరిగి వివాహమాడింది. 2014లో వీరికి ఒక కొడుకు జన్మించాడు.

అయితే ఊర్వశి రెండో తమ్ముడు నందు ఒక శృంగార భరితమైన మలయాళ చిత్రంలో నటించడం జరిగింది. 1989 ఆర్.బి.చౌదరి నిర్మాణంలో, తులసీదాస్ దర్శకత్వంలో “లయనం” అనే చిత్రం విడుదల అయింది. ఇందులో నందు, సిల్క్ స్మిత, అభిలాష, దేవిశ్రీ హీరో, హీరోయిన్లుగా నటించారు. ఇది శృంగార భరితమైన చిత్రం అయినప్పటికీ మలయాళంలో మంచి విజయాన్ని సాధించింది. నందు 17 సంవత్సరాలకే ఇలాంటి శృంగారభరితమైన చిత్రంలో నటించడం ఏమిటని అక్కయ్యలు కళారంజని, కల్పన, ఊర్వశి తమ్ముడు నందును నిలదీయడం జరిగింది. ఈ ముగ్గురు కెరీర్ మంచి పీక్ లో ఉన్నప్పుడు నందు ఇలా నటించడం వారు జీర్ణించుకోలేకపోయారు. ఆ తర్వాత నందు అలాంటి చిత్రాల్లో నటించనప్పటికీ దాదాపు లయనం విడుదలైన పది సంవత్సరాలకి తన 26వ ఏట హీరో నందు చనిపోవడం ఆయన కుటుంబ సభ్యులని తీవ్ర విషాదం లోకి నెట్టింది. లయనం అనే మలయాళ చిత్రం ఘన విజయం సాధించడంతో ఈ సినిమాని తమిళ, కన్నడ, హిందీ భాషల్లో కి అనువదించారు. ఇది సంగమం అనే పేరుతో తెలుగులోకి డబ్ కావడం జరిగింది.

telugudesk

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

3 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago