సినీ చరిత్రలో అభిమానులు ఏ అందమైన హీరోయిన్ కి గుడి కట్టారో మీకు తెలుసా.?!

0
258

దేవుళ్ళు లేదా దేవతలకు గుడి కట్టడం సర్వ సాధారణం. తర్వాత రాజులు, చక్రవర్తులకు గుడి కట్టిన దాఖలాలున్నాయి. ఆ తర్వాత స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న నాయకులకు గుడి కట్టిన సందర్భాలున్నాయి. ఇంకా చెప్పుకోవాలంటే రాజకీయ నాయకులకు ఆ పార్టీ కార్యకర్తలు గుడి కట్టిన దాఖలాలు ఉన్నాయి. కానీ సినీ పరిశ్రమలో ఓ వెలుగు వెలిగే తారలకు గుడి కట్టడం కూడా జరిగింది. అలాంటి తార ఎవరో కాదు, అందమైన రూపం కుర్రాళ్ల మతులు పోగొట్టే వయ్యారం ఆమె సొంతం. 1970 ముంబైలో పుట్టిన ఖుష్బూ బాల్యంలోనే అనేక చిత్రాల్లో నటించింది. 1980 నుండి 1985 మధ్య కాలంలో బాలీవుడ్ చిత్రాల్లో బాలనటి గా కొనసాగింది.

ఖుష్బూ బాలనటిగా ది బర్నింగ్ ట్రైన్ అనే హిందీ చిత్రంలో మొదటగా నటించింది. 1985 లో హీరో జాకీ ష్రాఫ్ తో జతగా జాను అనే చిత్రంలో ప్రధాన పాత్రలో కనిపించింది. ఆ తర్వాత 1986లో “తన్ బాదన్” అనే చిత్రంలో గోవింద తో కలిసి నటించింది. ఆ తర్వాత తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్ లో వెంకటేష్ న్యూ ఎంట్రీ తో వచ్చిన కలియుగ పాండవులు చిత్రంలో హీరోయిన్ గా ఖుష్బూ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో చిన్నోడు పెద్దోడు, కిరాయి దాదా, శాంతి క్రాంతి, భారతంలో అర్జునుడు, మారణహోమం, ప్రేమ కిరీటం, పేకాట పాపారావు ఆ తర్వాత చిరంజీవితో స్టాలిన్ చిత్రంలో నటించింది. ఇటీవలికాలంలో పవన్ కళ్యాణ్ తో అజ్ఞాతవాసి సినిమాలో కనిపించింది.

తమిళంలో రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్ కాంత్, మలయాళంలో మమ్ముట్టి, మోహన్ లాల్, సురేష్ గోపి, కన్నడంలో అంబరీష్, విష్ణువర్ధన్, టైగర్ ప్రభాకర్, రవిచంద్రన్ లాంటి వారితో నటించింది.
ఆ తర్వాత తమిళ సినిమాల్లో నటిస్తున్న సమయంలో దర్శకుడు సుందర్ ని ప్రేమించి పెళ్ళాడింది. వీరికి ఇద్దరూ కూతుర్లు కూడా ఉన్నారు. ఆ తర్వాత చెన్నైలోనే సెటిల్ అయింది. దాదాపు 30 సంవత్సరాల నుంచి చెన్నైలోనే ఉంటున్న కుష్బూ 2010లో కరుణానిధి నేతృత్వంలో నడుస్తున్న ద్రవిడ మున్నేట్ర కజగం అనే పార్టీలో చేరింది.

ఆ తర్వాత 2014లో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. దాదాపు ఆరు సంవత్సరాలు ఆ పార్టీలో కొనసాగి 2020లో భారతీయ జనతా పార్టీలో చేరి ఆ పార్టీకి సేవలు అందిస్తుంది. అయితే కుష్బూ సినిమాల్లో నటిస్తూండగానే ఆమెను అమితంగా ఆరాధించే తమిళ అభిమానులు ఆ రాష్ట్రంలోనే ఆమెకు ఏకంగా ఓ గుడి కట్టి ఆమెపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. అయితే భారతీయ సినీ చరిత్రలో ఓ సినీ తారకు ఇలా గుడి కట్టడం ఇదే మొదటిసారిగా పేర్కొనవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here