మన దేశ మొదటి మూకీ, టాకీ చిత్రాల గురించి మీకు తెలుసా..!!

0
169

సృష్టికి పునఃసృష్టి చేయడం అంటే సినిమాతోనే సాధ్యమవుతుంది అనడంలో సందేహం లేదు.. సినిమా అనేది ప్రేక్షకులను మరో కొత్త లోకంలోకి తీసుకెళ్లి ఊహల ఊయలలో రంజింప చేస్తుంది. బ్రిటిష్ వారి దమనకాండకు వ్యతిరేకంగా భారతీయులు ఉవ్వెత్తున స్వాతంత్ర ఉద్యమం కొనసాగుతున్న సమయంలో 1895లో ఫ్రాన్స్ కు చెందిన లూమియర్ బ్రదర్స్ మొదటగా ముంబైలో వాట్సన్ హోటల్లో మొదటి టాకీ చిత్రాన్ని ప్రదర్శించారు. కదిలే చిత్రం కావడంతో ప్రేక్షకులు ఎగబడి చూసారు. అలాగే జర్మనీ లండన్ అమెరికాకు చెందిన కొన్ని కంపెనీలు ఇలా మూకీ చిత్రాలను ప్రదర్శిస్తూ డబ్బులు తీసుకునే వారు.

1906లో ముంబైలో ది లైఫ్ ఆఫ్ క్రీస్తు అనే ఇంగ్లీషు మూకీ సినిమా ప్రదర్శింపబడింది. ఈ చిత్రాన్ని వీక్షించిన దర్శకుడు దాదాసాహెబ్ ఫాల్కేకు ఆ సినిమా తన మనసులో ఎక్కడో నాటుకుపోయింది. నాటకరంగం పట్ల అవగాహన ఉన్న దానిని సినిమా రూపంలో ఎలా తీయాలన్నా అవగాహన దాదాసాహెబ్ ఫాల్కేకు లేదు. ఆ క్రమంలో ఆయన లండన్ వెళ్లి ఫిల్మ్ మేకింగ్ నేర్చుకుని తిరిగి భారత్ రావడం జరిగింది.

1913లో 40 నిమిషాల నిడివితో రాజా హరిశ్చంద్ర అనే చిత్రాన్ని దాదాసాహెబ్ ఫాల్కే రూపొందించారు. కాకపోతే ఇది ఒక మూకీ చిత్రంగా పేర్కొనవచ్చు. ఎందుకంటే కేవలం చిత్రం కదలాడుతోంది కానీ శబ్దం వినపడదు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత 1922లో ఫ్రాన్స్ లో మొదటి టాకీ చిత్రం ప్రదర్శింపబడింది. జర్మనీ రాజధాని బెర్లిన్ లో శబ్దాన్ని మరింత స్పష్టతకు తీసుకు వచ్చారు.ఆ తర్వాత ఈ టాకీ చిత్రాలను డబ్బులు పెట్టి 1927లో మొదటిసారి అమెరికాలో చూడడం ప్రారంభించారు. ఇకపోతే భారత్ లో మూకీ చిత్రాల పరంపర 1931 వరకు కొనసాగింది.

అదే సంవత్సరం లో ఆలం ఆరా (ప్రపంచ ఆభరణం) అనే మొదటి టాకీ చిత్రం ముంబై లో రూపొందించబడింది. ఈ సినిమాని రూపొందించిన దర్శకుడు ఇరానీ తెలుగు తమిళంలో రూపొందించే బాధ్యతను తన అసిస్టెంట్ డైరెక్టర్ అయిన హెచ్ ఎం రెడ్డికి అప్పగించడం జరిగింది. 1932లో ఫిబ్రవరి 6న ‘భక్త ప్రహ్లాద’ అనే సినిమా తెలుగులో విడుదలైన మొదటి టాకీ చిత్రం గా చెప్పుకోవచ్చు.

అయితే 1922 లో రఘుపతి వెంకయ్య నాయుడు తన కొడుకు ఆర్ఎస్ ప్రకాష్ దర్శకుడిగా హీరోగా భీష్మ ప్రతిజ్ఞ అనే మూకీ చిత్రాన్ని రూపొందించడం జరిగింది. అయితే 1926లో సి.పుల్లయ్య దర్శకత్వంలో కాకినాడలో భక్త మార్కండేయ అనే చిత్రాన్ని గోడమీద ప్రదర్శించారు. భీష్మ ప్రతిజ్ఞ, భక్త మార్కండేయ ఈ రెండు చిత్రాలు భక్త ప్రహ్లాద సినిమా కంటే మొదటగా ప్రదర్శింపబడిన వీటికి మాటలు లేకపోవడంతో వీటిని మొదటి తెలుగు టాకీ చిత్రాలుగా పరిగణించబడేలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here