Ira khan : సెలబ్రిటీల పిల్లలు ఏమి చేసిన హాట్ టాపిక్ అవుతుంది. సోషల్ మీడియా పుణ్యమా అని సెలబ్రిటీ కిడ్స్ ను బాగా నెటిజన్లు ఆడుకుంటుంటారు. ఇక స్టార్ కిడ్స్ కూడా అవేమి పట్టనట్టు వాళ్లకు నచ్చింది చేసేస్తుంటారు. ఈ పోకడ సౌత్ సినీ ఇండస్ట్రీ లో తక్కువ కానీ బాలీవుడ్ లో మాత్రమే స్టార్ కిడ్స్ ను నెటిజన్స్ బాగా ట్రోల్స్ చేస్తుంటారు. ఇపుడు కూడా అలానే ఒక బాలీవుడ్ హీరో డాటర్ ని బాగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్.

బికినీ తో బర్త్ డే సెలబ్రేషన్స్….
బాలీవుడ్ ఖాన్ త్రయంలో ఒకరైన అమీర్ ఖాన్ కు చాలా మంచి ఫాలోయింగ్ ఉంది. మంచి కథలను ఎంచుకుని సినిమాలను తీస్తుంటారు. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ గా పిలవబడే అమీర్ ఖాన్ వ్యక్తిగత జీవితంలో మాత్రం రెండు పెళ్లిళ్లు చేసుకొని ఇపుడు మూడో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. వీటిలో నిజమెంతో తెలియక పోయినా ఇక ఈయన గారాలపట్టి మాత్రం ఇపుడు న్యూస్ అయింది.

పుట్టినరోజు సందర్బంగా అమీర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ ధరించిన డ్రెస్ వల్ల అందరు ఆమెను విమర్శిస్తున్నారు. తన 25 వ పుట్టినరోజును చాలా గ్రాండ్ గా చేసుకుంది ఇరా ఖాన్. బికినీ ధరించి పుట్టినరోజు కేక్ కట్ చేసిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. అదే కాకా ఇక స్విమ్మింగ్ పూల్ లో బర్త్ డే ని ఎంజాయ్ చేస్తూ ఉన్న వీడియో కూడా నెట్ లో హల్ చల్ చేస్తోంది. ఇరా ఖాన్ ఎప్పటికప్పుడు ఇలానే పొట్టి బట్టలతో ఎక్స్ పోజ్ చేస్తూ అందరి నోటా పడుతోంది. విమర్శలపాలవుతోంది. ఇక ఇప్పుడు కూడా కొంచెం బట్టలు సరిగా వేసుకోవచ్చు కదా సిగ్గులేదా అంటూ ఘాటు గా నెటిజన్స్ స్పందిస్తున్నారు.
































