రైలు ప్రయాణికులకు ఐఆర్సీటీసీ శుభవార్త అందించింది. ITCTC వెబ్ సైట్ లేదా యాప్ లో రైలు టిక్కెట్లను బుక్ చేసి రద్దు చేసిన తర్వాత ప్రయాణీకులు రీఫండ్ కోసం సుమారు 2-3 రోజులు వేచి ఉండాల్సిన అవసరం లేదు అని పేర్కొంది. IRCTC పేమెంట్ గేట్ వే ITCTC-ఐపే ద్వారా ట్రైన్ టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణీకులు ఆ టికెట్లు రద్దు చేసిన వెంటనే రీఫండ్ పొందనున్నారు. కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియా ప్రచారంలో భాగంగా IRCTC-ఐపేను 2019లో ప్రారంభించింది. దీనికి సంబంధించి ITCTC తన వెబ్ సైట్ ను కూడా అప్ గ్రేడ్ చేసింది.

అయితే పెరుగుతున్న ప్రయాణీకుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని, IRCTC తన యూజర్ ఇంటర్ ఫేస్ ఇదివరకే అప్ గ్రేడ్ చేసింది. అందువల్ల వల్ల టిక్కెట్లు బుక్ చేసుకోవడంలో ఎక్కువ సమయం వెచ్చించాల్సిన అవసరం ఉండదు అని అన్నారు. అయితే ఈ కొత్త ఏర్పాట్ల వల్ల ప్రయాణీకులు తత్కాల్, సాధారణ టిక్కెట్లను సులభంగా బుక్ చేయడమే కాకుండా రద్దు చేసిన వెంటనే డబ్బులు ఖాతాలో జమ అయ్యేటట్లు వెబ్ సైట్, పోర్టల్ ఆధునీకరణ చేసినట్లు తెలిపారు.



























