Iron Leg Shasthri : సినిమా రంగంలో అవకాశాలు ఉండి మనకు ఫేమ్ ఉన్నంతవరకే మన చుట్టూ మనుషులు ఉంటారు. అది ఒక్క సారి పోయిందంటే మన చుట్టూ కూడా ఎవరూ ఉండరు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా పట్టించుకునేవారు ఉండరు. అందుకే ఆ రంగుల ప్రపంచంలో స్నేహాలు, బంధాలు శాశ్వతం కాదు అలాంటి పరిస్థితే ఐరన్ లెగ్ శాస్త్రి గారి కుటుంబానికి వచ్చింది. ఓవర్ నైట్ స్టార్ కమెడియన్ అయిపోయిన ఐరన్ లెగ్ శాస్త్రి గారు వరుస అవకాశాలతో బిజీ అయిపోయారు. కానీ అంతే త్వరగా కెరీర్ పడిపోయింది. ఒక్కసారిగా డౌన్ ఫాల్ మొదలయ్యాక ఆర్థికంగా నష్టపోయారు. అవకాశాలు ఓ వైపు లేక ఆర్థికంగా కుటుంబాన్ని పోషించుకోడానికి మళ్ళీ పౌరోహిత్యం చేసుకోవాలని సొంతూరు తాడేపల్లి గూడెం వెళ్లిపోయారు. అయితే అప్పటికే తాగుడుకి అలవాటు పడిన ఆయన ఆరోగ్యం క్షీణించి మరణించారు. అయితే అనారోగ్యానికి గురైనపుడు కానీ ఆయన మరణించాక కానీ ఇండస్ట్రీ నుండి ఎటువంటి ఆదరణ, సహాయం అందలేదు. ఇక ఈ విషయాలను చెబుతూ శాస్త్రి గారి అబ్బాయి ప్రసాద్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

ఏ పరిచయం లేని సంపూర్ణేష్ బాబు చదువుకు సహాయం చేశారు…
ఐరన్ లెగ్ శాస్త్రి గారు బ్రహ్మానందం, రాజేంద్రప్రసాద్ కాంబినేషన్ హిట్ కాంబినేషన్ సినిమాల్లో ఐరన్ లెగ్ శాస్త్రి కి అవకాశం ఇచ్చింది గుర్తింపు వచ్చేలా చేసింది ఈవివి సత్యనారయణ గారు. కానీ ఆయన ఆర్థికంగా చితికిపోయి, అనారోగ్యం తో బాధపడుతున్న సమయంలో వాళ్లెవరు సహాయం చేయలేదు. ఇక ఆయన మరణించాక సినిమా ఇండస్ట్రీ నుండి ఏదైనా సహాయం వస్తుందని ఎదురుచూసిన రాలేదు.

కేవలం ఇండస్ట్రీ తరుపు నుండి కాదంబరీ కిరణ్ మాత్రమే సహాయం చేశారట. ఇక అసలు పరిచయం లేని సంపూర్ణేష్ బాబు గారు శాస్త్రి గారి పిల్లల చదువుకు సహాయం చేశారట. ఇక ఈ విషయాన్ని ఇటీవల ఇంటర్వ్యూల్లో ఐరన్ లెగ్ శాస్త్రి గారి అబ్బాయి ప్రసాద్ పంచుకున్నారు. ఆయన చేసిన సహాయం మా చదువులకు ఉపయోగపడిందని చెప్పారు. కస్టపడి చదివి ఉద్యోగం సంపాదించుకున్నానని ఇండస్ట్రీలోకి ఎప్పుడూ రావద్దని నాన్న చెప్పారని కానీ కొన్ని సినిమాలను చేసాక ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ లేకపోతే ఏదగడం కష్టమని అర్థమైంది, స్వాభిమానం వదిలి ఉండలేక మళ్ళీ ఉద్యోగం చేస్తున్నానని చెప్పారు.































