Iron Leg Shasthri : సినిమా రంగంలో అవకాశాలు ఉండి మనకు ఫేమ్ ఉన్నంతవరకే మన చుట్టూ మనుషులు ఉంటారు. అది ఒక్కసారి పోయిందంటే మన చుట్టూ కూడా ఎవరూ ఉండరు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా పట్టించుకునేవారు ఉండరు. అందుకే ఆ రంగుల ప్రపంచంలో స్నేహాలు, బంధాలు శాశ్వతం కాదు అలాంటి పరిస్థితే ఐరన్ లెగ్ శాస్త్రి గారి కుటుంబానికి వచ్చింది. ఓవర్ నైట్ స్టార్ కమెడియన్ అయిపోయిన ఐరన్ లెగ్ శాస్త్రి గారు వరుస అవకాశాలతో బిజీ అయిపోయారు. కానీ అంతే త్వరగా కెరీర్ పడిపోయింది. ఒక్కసారిగా డౌన్ ఫాల్ మొదలయ్యాక ఆర్థికంగా నష్టపోయారు. అవకాశాలు ఓ వైపు లేక ఆర్థికంగా కుటుంబాన్ని పోషించుకోడానికి మళ్ళీ పౌరోహిత్యం చేసుకోవాలని సొంతూరు తాడేపల్లి గూడెం వెళ్లిపోయారు. అయితే అప్పటికే మద్యంకి అలవాటు పడిన ఆయన ఆరోగ్యం క్షీణించి మరణించారు. అయితే అనారోగ్యానికి గురైనపుడు కానీ ఆయన మరణించక కానీ ఇండస్ట్రీ నుండి ఎటువంటి ఆదరణ, సహాయం అందలేదు. ఇక ఈ విషయాలు చెబుతూ శాస్త్రి గారి అబ్బాయి ప్రసాద్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

రిక్షాలో శవాన్ని తీసుకోచ్చారు… ఇలాంటి జీవితం ఎవరికీ రాకూడదు…
అవకాశాలు లేక ఇక సొంతూరు వచ్చేసిన తరువాత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఐరన్ లెగ్ శాస్త్రి గారు అక్కడే మరణించారు. ఛాతిలో మంటగా అనిపించి హాస్పిటల్ కి వెళ్లిన ఆయన వెళ్ళేటపుడు అంబులెన్సు లో ఆయనే వెళ్లి కూర్చున్నారట. అక్కడికి వెళ్ళాక కూడా అందరితో జోకులు వేసుకుంటూ సరదాగా ఉన్నారు. కానీ డాక్టర్స్ అప్పటికే మించి పోయింది ఈయన ఎక్కువ కాలం బ్రతకరు అని చెప్పేశారట. ఇక ఐరన్ లెగ్ శాస్త్రి గారి పిల్లలు హైదరాబాద్ లో ఎవరిదో ఫంక్షన్స్ కి వెళ్లగా వాళ్ళ మేనత్త వాళ్ళు ఫోన్ చేసి వచ్చేయమని చెప్పారట.

ఇక రాత్రి వంటి గంట సమయంలో ఐరన్ లెగ్ శాస్త్రి గారు మరణించారు. అంబులెన్సు కూడా లేక రిక్షాలో శవాన్ని ఇంటికి తీసుకోచ్చారట. అవన్నీ తలుచుకుని ఐరన్ లెగ్ శాస్త్రి గారి అబ్బాయి ప్రసాద్ ఎమోషనల్ అయ్యారు. అలాంటి జీవితం ఎవరికీ రాకూడదు అంటూ చెప్పారు. మరణించక ముందు వరకూ నేను చనిపోతే కుటుంబం పరిస్థితి ఏమిటి అని బాధపడుతూనే ఉండేవారట ఐరన్ లెగ్ శాస్త్రి గారు. ప్రస్తుతం మేనత్త వల్ల బాగా చదువుకుని స్థిరపడ్డారు ప్రసాద్ ఆయన చెల్లి.
































