Iron leg Shasthri : తాడేపల్లిగూడెం కి చెందిన విశ్వనాథ శాస్త్రి గారు అంటే అంతగా తెలియక పోవచ్చు కానీ ఐరన్ లెగ్ శాస్త్రి అనగానే అందరికీ టక్కున గుర్తొస్తారు. ‘ప్రేమఖైదీ’ సినిమాతో పరిచయమైన శాస్త్రి గారు ఆ తరువాత జంబలకిడిపంబ, అప్పుల అప్పారావు వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నారు. చాలా త్వరగా స్టార్ కమెడియన్ గా ఎదిగిన శాస్త్రి గారు ఐరన్ లెగ్ అన్న పదాన్ని తన పేరు ముందు తగిలించుకున్నారు. అయితే సినిమా కెరీర్ ను సరిగా ప్లాన్ చేసుకోకపోవడం వల్ల ఎంత త్వరగా స్టారడమ్ వచ్చిందో అంతే త్వరగా పోయింది. ఇక అవకాశాలు సన్నగిల్లడంతో మళ్ళీ స్వగ్రామానికి వెళ్లిపోయారు. అయితే ఆర్ధిక ఇబ్బందులు ఒకవైపు, అనారోగ్య సమస్యలు మరో వైపు చుట్టేయడం చిన్నవయసులోనే ఆయన కన్నుమూశారు.

నాన్న చనిపోయాక ఇండస్ట్రీ ఎలాంటిదో అర్థమైంది…
ఇక ఆయన కొడుకు ప్రసాద్ అడపాదడపా కొన్ని సినిమాల్లో నటించారు. కానీ ఇండస్ట్రీలో ఏ సపోర్ట్ లేకుండా ఎదగడం చాలా కష్టమని స్వాభిమానాన్ని చంపుకుని అక్కడ ఉండలేక మళ్ళీ సొంతూరుకి వచ్చేసి మళ్ళీ నా ఉద్యోగం నేను చూసుకున్నానంటూ చెప్పారు ప్రసాద్. నాన్న మరణించినపుడు చూడటానికి కొంతమంది ఇండస్ట్రీ వాళ్ళు వచ్చారు కానీ అనారోగ్యం తో బాధపడుతున్నపుడు ఎవరూ ఆదుకోలేదని, సహాయం ఇండస్ట్రీ నుండి రాలేదని ప్రసాద్ చెప్పారు. ఏనాడూ తన తండ్రి ఇండస్ట్రీలో పడిన కష్టాలను చెప్పలేదని, ఇంట్లో వాటి ప్రస్తావన ఉండేది కాదని కాకపోతే నన్ను మాత్రం నీకు ఇండస్ట్రీ వద్దు చదువుకొని మంచి ఉద్యోగం చేసుకో అని చెప్పేవారంటూ ప్రసాద్ ఆయన జ్ఞాపకాలను పంచుకున్నారు.

అందరూ రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం తో శాస్త్రికి అనుబంధం ఎక్కువ కాబట్టి వాళ్ళు సహాయం చేసుంటారని అనుకున్ననారు. చాలా ఇంటర్వ్యూల్లో అదే అడిగారు కానీ అలాంటిదేమీ లేదు. వాళ్లెవరూ పట్టించుకోలేదు. ఆయనకు అవకాశాలు రాకుండా కొంతమంది కో స్టార్స్ చేసినట్లు కొంతమంది మా నాన్న మరనించాక చెప్పారు. కొంతమంది డైరెక్టర్స్ అడ్వాన్స్ ఇచ్చి షూటింగ్ అపుడు మీరు వద్దు అని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. దీంతో చాలా డిప్రెషన్ కి వెళ్లిన ఆయన సొంతూరు వచ్చేసారు. ఇక ఇండస్ట్రీ లో కొంతమంది వల్ల తాగుడు అలవాటు కావడం, ఆయన హెవీ పర్సనాలిటీ వల్ల కామెర్లు వచ్చి కాలేయం చెడిపోయి మరణించారని ప్రసద్ చెప్పారు. ఇక ఇండస్ట్రీ నుండి కాదంబరి కిరణ్, సంపూర్ణేశ్ బాబు ఇద్దరూ సహాయం చేసారు. అది నాకు నా చెల్లి చదువుకు ఉపయోగపడింది అంటూ చెప్పారు.






























