Balakrishna – Chiranjeevi: నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా ఆహా వేదికగా ప్రసారమైన అన్ స్టాపబుల్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతో మంది సినీ సెలబ్రిటీలు ఈ కార్యక్రమానికి హాజరై బాలయ్యతో కలిసి ఎంతో సరదాగా ముచ్చటించారు. డిజిటల్ ప్లాట్ ఫామ్ వేదికగా ఈ కార్యక్రమం నెంబర్ వన్ స్థానంలో కొనసాగిందని చెప్పవచ్చు.
ఈ కార్యక్రమానికి ఎంతోమంది సెలబ్రిటీలు వచ్చినప్పటికీ మెగాస్టార్ చిరంజీవి మాత్రం హాజరు కాలేదు.అయితే మెగాస్టార్ చిరంజీవి ఈ కార్యక్రమానికి రాకపోవడానికి గల కారణం ఏమిటి అనే విషయాన్ని షో కోసం పని చేస్తున్న బీవీఎస్ రవి మెగాస్టార్ చిరంజీవి ఎందుకు రాలేదు అనే విషయాన్ని బయటపెట్టారు.
సాధారణంగా చిరంజీవి బాలకృష్ణ మధ్య సినిమాల విషయంలో తీవ్ర స్థాయిలో పోటీ ఉండటం వల్ల వీరిద్దరికి పరస్పర మనస్పర్ధలు ఉండటం చేత ఈ కార్యక్రమానికి హాజరు కాలేదని చాలామంది భావించారు. నిజానికి చిరంజీవి ఈ కార్యక్రమానికి రాకపోవడానికి గల కారణం ఏమిటి అంటే చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉండటమే కారణమని రవి వెల్లడించారు.
మొదటి సీజన్ లో మెగాస్టార్ చిరంజీవి పాల్గొన లేకపోయినప్పటికీ రెండవ సీజన్ లో మాత్రం మెగాస్టార్ తప్పకుండా పాల్గొంటారని అందుకు సంబంధించిన వర్క్ కూడా జరిగిందని బీవీఎస్ రవి వెల్లడించారు.అయితే ఇప్పటి వరకు ఈ కార్యక్రమం కోసం నాగార్జునని అడగలేదని ఇక వెంకటేష్ వెబ్ సిరీస్ లతో బిజీగా ఉండటం వల్ల ఈ కార్యక్రమానికి హాజరు కాలేక పోయారని ఆయన తెలియజేశారు. ఇక సీజన్ 2 ఈ ఏడాది చివరిలో ప్రారంభం కావచ్చని రవి తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…