Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ లో వచ్చే సార్వత్రిక ఎన్నికల హడావిడి అప్పుడే మొదలైందని చెప్పాలి.ఈ క్రమంలోనే అన్ని పార్టీల నేతలు రాష్ట్ర రాజకీయాలలో చురుకుగా పాల్గొంటూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఏపీలో పొత్తుల గురించి పెద్ద ఎత్తున పలు పార్టీల మధ్య చర్చలు మొదలవుతున్న వేల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పొత్తుల గురించి పరోక్షంగా స్పందిస్తూ తన పార్టీ కార్యకర్తలను, అభిమానులను అలర్ట్ చేశారు. ఈ క్రమంలోనే ఆయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. జర భద్రం… అప్పటివరకు మనల్ని తిట్టిన నాయకులు ఉన్నఫలంగా మనల్ని పొగుడుతున్నారు. అలా ఆ పొగడ్తలను చూసి ఆ నాయకుడు మారిపోయాడు, అతను పరివర్తన చెందాడని చప్పట్లు కొడితే మన ప్రత్యర్థి కల నెరవేరినట్లే.

అప్పటి వరకు మనల్ని తిట్టిన నాయకులు ఒక్కసారిగా మన పై ప్రశంసలు కురిపిస్తూ, మనల్ని పొగుడుతున్నారు కదా అని వారిని ఆకాశానికి ఎత్తకండి ఇలా వాళ్లు పొగడడం కూడా వారి మైండ్ గేమ్ లో ఒక భాగమే అని గుర్తుపెట్టుకోండి అంటూ పవన్ కళ్యాణ్ పరోక్షంగా తన పార్టీ కార్యకర్తలకు జనసేన నాయకులకు పొత్తుల గురించి పరోక్షంగా ఈ విధమైనటువంటి ట్వీట్ చేశారు.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవడమే కాకుండా ఎంతో ఆసక్తికరంగా మారింది.
మొదలైన ఎన్నికల హడావిడి…
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ప్రతి ఒక్క పార్టీ నేతలు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ పెద్ద ఎత్తున తమ పార్టీని బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ సైతం వచ్చే ఎన్నికలలో విజయం సాధించడం కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాలలో బిజీగా ఉంటూనే మరోవైపు పలు సినిమాలలో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు.
జర బద్రం
— Pawan Kalyan (@PawanKalyan) June 8, 2022
—————
అప్పటి వరకు మనల్ని తిట్టిన నాయకులు సడెన్ గా మనల్ని పొగడ్డం ప్రారంభిస్తారు. ఆ పొగడ్తలను చూసి ఆ నాయకుడు మారిపోయాడు, పరివర్తన చెందాడని మనం భావించి చప్పట్లు, ఆనందకరమైన ఎమోజీలు పెడితే ప్రత్యర్థుల లక్ష్యం నెరవేరినట్లే.(cont..)































