IYR Krishna Rao : ఎండలు మడిపోతున్నవేళ రాజకీయ వేడి రెండు తెలుగు రాష్ట్రాలలోనూ రగులుతోంది. ఇంతకాలం బ్యూరో క్రాట్ గా ఉన్న ఐవైఆర్ కృష్ణా రావు గారు ప్రస్తుతం రిటైర్మెంట్ తరువాత బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన సర్వీస్ లో కలెక్టర్ గాను అలాగే సిఎస్ గాను పనిచేసిన ఆయన విభజిత ఆంధ్రప్రదేశ్ కి చీఫ్ సెక్రటరీగా పనిచేసారు. కృష్ణా రావు గారు ఆయన సర్వీస్ గురించి, ప్రస్తుత రాజకీయ పార్టీలు, నెక్స్ట్ ఎలక్షన్ గెలుపు గుర్రాల గురించి యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.

సిఎస్ గా నా ఓటు ఆ సీఎంకే…
కృష్ణా రావు గారు ప్రస్తుత రాజకీయాల గురించి మాట్లాడుతూ ఏపీలో కంటే బీజేపీ తెలంగాణలో బలంగా ఉందని నెక్స్ట్ 2024 లో అధికారం మాదే అంటూ చెప్పారు. తెలంగాణలో బలంగా ఉందని ఖచ్చితంగా గట్టిపోటీ ఉంటుందని అపుడే రాష్ట్రంలో బీజేపీ వేవ్ తెలుస్తోందని తెలిపారు. ఇక తాను సిఎస్ గా అటు రాజశేఖర్ రెడ్డి వద్ద అలాగే చంద్రబాబు వద్ద ఇద్దరు సీఎంల దగ్గరా పనిచేసారు.

అయితే ఇద్దరిలో ఎవరిని ఎంచుకుంటారనే ప్రశ్నకు చంద్రబాబు నాయుడు అంటూ సమాధానం చెప్పారు. విభజిత ఏపీకి మొదటి సీఎం గా చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో కృష్ణా రావు గారు విబేదించడం అప్పట్లో చర్చనీయాంశం కాగా నేడు సిఎస్ గా సీఎంను ఎంచుకోమంటే చంద్రబాబు అని చెప్పడం ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక దేశ సరిహద్ధుల్లో ఉండే సైనికులా లేక మన మధ్య ఉండి కాపాడే పోలీసులను ఎంచుకుంటారా అంటే ఆర్మీ అని సమాధానం చెప్పారు.