J.D. Chakravarthy : కోడి రామకృష్ణ ఉదయం నాలుగు గంటల వరకు పని చేస్తారు… మీకు ఆ జబ్బు ఉంది కదా అని మొహం మీదే అడిగేసాను…: నటుడు జేడి చక్రవర్తి

0
103

J.D. Chakravarthy : శివ సినిమాతో తెలుగులో పరిచయమైన నాగులపాటి శ్రీనివాస చక్రవర్తి కంటే జేడి చక్రవర్తి అనగానే ప్రేక్షకులకు గుర్తొస్తాడు. మొదటి సినిమా క్యారెక్టర్ పేరును తన పేరులో పెట్టుకున్న జేడి చక్రవర్తి శివ, సత్య, దెయ్యం, ఎగిరే పావురమా, మనీ, మనీ మనీ అంటూ పలు సినిమాల్లో నటించి మంచి గుర్తంపు తెచ్చుకున్నాడు. గురువు ఆర్జీవి బాటలో హిందీలో అనేక సినిమాల్లో నటించిన జేడీ, అటు తమిళం, కన్నడ, మాలయం సినిమాల్లో నటించారు. అలాగే దర్శకత్వం కూడా కొన్ని సినిమాలకు చేసారు. తాజాగా యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

కోడి రామకృష్ణ గారికి ఆ జబ్బుందని అడిగేసాను…

జేడి చక్రవర్తి మొదట అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తూ సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఇక ఆయన చాలా ఇంటర్వ్యూలలో తన గురువు ఆర్జివి గురించి చెప్పకుండా మాట్లాడరు. అయితే ఆయనకు ఆర్జివి కాకుండా నచ్చే మరో డైరెక్టర్ కోడి రామకృష్ణ గారంటూ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఆయన సినిమాల్లో చాలా సినిమాలు నచ్చుతాయని, ఆయనతో కలిసి ‘నవ్వుతూ బతకాలిరా’ సినిమా చేసినపుడు ఆయన పనితనం చూశానంటూ చెప్పారు. ఆయన రాత్రి మూడుగంటలైనా పనిచేస్తారు. మళ్ళీ అర్ధగంట పడుకుని నాలుగు అయ్యేలోపు లేచి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేస్తారు.

నేను ఆయన నిద్రపోకుండా అలా పనిచేయడం చూసి షాక్ అయ్యాను. అందుకే ఆయననే అడిగేసాను మీకు ఇన్సోమ్నియ జబ్బు ఉంది కదా అందుకే నిద్రపట్టదు కదా అని. ఆయన అలాంటిదేమీ లేదు అంటూ బదులిచ్చారు. ఆయన లేచే సరికి నేను వెళ్ళేవాడిని, ఆయన ఉదయం ఏడు గంటల నుండి పనిచేసి మళ్ళీ మూడు గంటలకే వస్తాడేంటి వీడు అని నన్ను ముచ్చటగా చూసే వాడు. మొదట్లో నాకు ఈస్టు గోదావరి యాస రాదేమో అని బయపడ్డా అయన నా యాసకు ముచ్చట పడ్డారు. నాతో ప్రేమలో పడ్డారు అంటూ చక్రి కోడి రామకృష్ణ గారి గురించి వివరించారు.