J.D. Chakravarthy : ‘శివ’ సినిమాతో తెలుగులో పరిచయమైన నాగులపాటి శ్రీనివాస చక్రవర్తి కంటే జేడి చక్రవర్తి అనగానే ప్రేక్షకులకు గుర్తొస్తాడు. మొదటి సినిమా క్యారెక్టర్ పేరును తన పేరులో పెట్టుకున్న జేడి చక్రవర్తి శివ, సత్య, దెయ్యం, ఎగిరే పావురమా, మనీ, మనీ మనీ అంటూ పలు సినిమాల్లో నటించి మంచి గుర్తంపు తెచ్చుకున్నాడు. గురువు ఆర్జీవి బాటలో హిందీలో అనేక సినిమాల్లో నటించిన జేడీ తమిళం, కన్నడ, మాలయం సినిమాల్లో నటించారు. అలాగే దర్శకత్వం కూడా కొన్ని సినిమాలకు చేసారు. తాజాగా డిస్నీ హాట్ స్టార్ లో ‘దయ’ అనే వెబ్ సిరీస్ లో నటించారు. ఆగష్టులో వచ్చిన ఈ వెబ్ సిరీస్ గురించి ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ తన కెరీర్ అలాగే వ్యక్తిగత విషయాలను మాట్లాడారు.

తేజ కు మతిమరుపు వచ్చినట్లుంది…
డైరెక్టర్ తేజ ప్రేమ వివాహం చేసుకున్నాడు. నెల్లూరుకి నేను తేజ వెళ్ళాము. మొదట ఒక చోట వెయిట్ చేస్తే అక్కడికి రాలేదు. దీంతో మేము ఇంకో చోటికి వెళ్లి ఒక పాడుబడిన ఇంటి దగ్గర తేజ దాక్కొని నన్ను ముందుకు వెళ్లి తాను ప్రేమించిన అమ్మాయిని ఎక్కించుకోమని చెప్పాడు. నేను కొత్తకారు అప్పుడే తీసుకున్నాను. నా ముందు ఇరవై మంది నిలుచున్నారు. నా కారు తగలబడిబోతుందని టెన్షన్ పడ్డాను. కర్రలు, రాళ్ళు తీసుకుని వచ్చారు. ఆ సంఘటన నాకు బాగా గుర్తు ఒకప్పట్లో సితార పత్రికలో కూడా ప్రేమికుల రోజు సందర్బంగా తేజ ఈ స్టోరీ అంతా చెప్పాడు. తాను మర్చిపోయాడేమో నా కారు ఆరోజు ఏమవుతుందో అనే భయం నాకు తెలుసు నేను మర్చిపోలేదు. కావాలంటే ఆ మ్యాగ్జైన్ లో చూడొచ్చు అంటూ క్లారిటీ ఇచ్చారు.

తేజ కు వయసు పెరిగే కొద్ది మైండ్ దొబ్బినట్లుంది. మతిమరుపు వస్తున్నట్లుంది అంటూ చక్రి కామెంట్స్ చేసారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో డైరెక్టర్ తేజ తన వివాహం గురించి మాట్లాడుతూ తన పెళ్లి అక్కినేని నాగార్జున వాళ్ళ అన్న వెంకట్ ఆయన భార్య చేసారని, చక్రి చెప్పిన కథ అంతా అపద్ధం అంటూ చెప్పడంతో జేడి చక్రవర్తి తేజ లవ్ స్టోరీ అలాగే పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చి తేజ మీద కామెంట్స్ చేసారు.