J.D. Chakravarthy : పెద్ద మొత్తంలో నాకివ్వాల్సిన డబ్బు ఎగొట్టారు… అనవసరంగా దాసరి గారు మధ్యలో ఎంటర్ అయ్యారు…: జేడి చక్రవర్తి

0
107

J.D. Chakravarthy : శివ సినిమాతో తెలుగులో పరిచయమైన నాగులపాటి శ్రీనివాస చక్రవర్తి కంటే జేడి చక్రవర్తి అనగానే ప్రేక్షకులు గుర్తిస్తారు. మొదటి సినిమా క్యారెక్టర్ పేరును తన పేరులో పెట్టుకున్న జేడి చక్రవర్తి శివ, సత్య, దెయ్యం, ఎగిరే పావురమా, మనీ, మనీ మనీ అంటూ పలు సినిమాల్లో నటించి మంచి గుర్తంపు తెచ్చుకున్నాడు. గురువు ఆర్జీవి బాటలో హిందీలో అనేక సినిమాల్లో నటించిన జేడీ తమిళం, కన్నడ, మాలయం సినిమాల్లో నటించారు. అలాగే దర్శకత్వం కూడా కొన్ని సినిమాలకు చేసారు. తాజాగా ‘దయ’ అనే వెబ్ సిరీస్ తో వస్తోన్న చక్రి ఆ ప్రొమోషన్స్ లో భాగంగా యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

నాకివ్వాల్సింది ఎగొట్టి, పంచాయితీ దాసరి గారి వద్దకు చేరింది…

తన కెరీర్ లో తనకు రావాల్సిన డబ్బు ఎగొట్టినా పెద్దగా పట్టించుకోలేదని ఆ విషయాలను ఎవరూ చెప్పరని, నేను ఒక నిర్మాతతో గొడవ పడిన విషయం మాత్రం బాగా హైలైట్ అయింది. మా పెళ్ళికి రండి అనే సినిమా టైములో ప్రొడ్యూసర్ నాకివ్వాల్సిన డబ్బులను ఎగొట్టగా నిజంగానే వాళ్ళతో లేవని నేను వదిలేసాను. కానీ మరోచోట ఒక బిల్డింగ్ కడుతున్నారని తెలిసి నా డబ్బు నాకిమ్మని ఒత్తిడి చేయడంతో ఆ నిర్మాతకు దాసరి గారు సన్నిహితులు కావడంతో ఆయన ఎంటర్ అయ్యారు. ఆయన ఫోన్ చేసి కలవాలని చెబితే మొత్తం విషయం చెప్పాను.

ఇక ఆయన ఏమి మాట్లాడలేక పోయారు. మరో నిర్మాత కూడా ఇలానే ఇవ్వలేక నా మీద తప్పుడు కేసు వేసాడు. పదేళ్ళు కోర్ట్ ద్వారా కొట్లాడాము. చివరికి తీర్పు నాకు అనుకూలంగా వచ్చింది డబ్బు కట్టాలని ఆయనకి నోటీసులు వస్తే అక్కడే ఆ పేపర్స్ చించేసాను. ఆయన డబ్బు ఇవ్వలేక సమయం తీసుకోడానికి నా మీద కేసు వేసాడు. నేను డబ్బు ఇవ్వలేనని చెప్పుంటే అపుడే పర్వాలేదు నాకేమవ్వదు అని చెప్పుండేవాడిని కానీ ఆయన కోర్ట్ దాకా వెళ్ళాడు అంటూ చక్రవర్తి చెప్పారు.