Jabardasth : తెలుగు బుల్లితెర లో ప్రసారమవుతున్న టాప్ రేటెడ్ ప్రోగ్రాములలో ఒకటైన జబర్దస్త్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలా మంది నటీ నటులకు జబర్దస్త్ జీవితాన్ని ఇచ్చింది. జబర్దస్త్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వారు చాలానే ఉన్నారు. ఇలా గుర్తింపు తెచ్చుకున్న వారిలో రాకెట్ రాఘవ ఒకరు. జబర్దస్త్ ప్రోగ్రాం మొదలు పెట్టినప్పటినుండి ఇప్పటి వరకు రాకెట్ రాఘవ కొనసాగుతూనే ఉన్నారు. ఇపుడు తనతో పాటు తన కొడుకు మురారి కూడా అప్పుడప్పుడు జబర్దస్తలో కనిపించి సందడి చేస్తుంటాడు.

వరుస పంచులతో అందరినీ ఆకట్టుకుంటూ…
కేవలం జబర్దస్త్ లో మాత్రమే కాకుండా మురారి శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా సందడి చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీలలో చాలా మంది పిల్లలు వస్తున్నప్పటికీ మురారి క్రేజ్ ఎక్కువగా ఉండటం విశేషం. వరుస పంచులతో కడుపుబ్బ నవ్విస్తుంటాడు. రాకెట్ రాఘవ స్కిట్లలో అయితే తన తండ్రి మీద వరుస వంచులు వేస్తూ స్కిట్ ను హైలెట్ చేస్తాడు. మిగతా టీములలో కూడా అప్పుడప్పుడు కనిపించి సందడి చేస్తుంటాడు.

చిన్న వయసులోనే అందరినీ ఆకట్టుకుంటున్న మురారి రెమ్యూనరేషన్ కూడా బాగానే తీసుకుంటున్నాడు. మురారి ఏకంగా ఒక్క కాల్ షీట్ కోసం 5000 రూపాయల వరకూ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట. కొంచెం నిడివి ఎక్కువగా ఉన్న స్కిట్ అయితే పదివేల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటాడని సమాచారం. ఈ రెమ్యూనరేషన్ ని మల్లెమాల స్వయంగా ఇస్తుండదట, లేకపోతే టీమ్ లీడర్ ఇస్తారట.