Jabardhasth Komarakka : జబర్దస్త్ లో కమెడియన్ బాగా తెలిసిన కొమరం అనేకంటే కొమరక్క అనగానే గుర్తొస్తాడు. ముసలి వయసు మహిళగా తెలంగాణ యాసలో మాట్లాడుతూ కామెడీ పండించిన కొమరం ప్రస్తుతం జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, చేస్తూనే యూట్యూబ్ ఛానెల్ ‘కొమరం టీవి’లో కామెడీ పండిస్తూనే అలాగే సినిమాలలోనూ నటిస్తున్నాడు. గడిచిన ఐదేళ్లలో నా కెరీర్ మారిపోయిందని, నన్ను నేను కొత్తగా చూసుకుంటున్నాను అంటూ కారులో ఎప్పటికైనా కూర్చో గలనా అనుకునే వాడిని కారు కొనుక్కోగాలిగాను అంటూ ఎమోషనల్ గా సాగిన కొమరం ఇంటర్వ్యూలో తాను ఎదుర్కొన్న కష్టాలను, తాను చూసిన అనుభవాలను పంచుకున్నారు.

టీవీ ఛానెల్ నుండి నేడు సినిమా వరకు…
మహబూబ్ నగర్ జిల్లా లోని ఒక పల్లెలో పుట్టి పెరిగిన కొమరం చదువుకున్నది 10 క్లాస్. అయితే మిమిక్రి బాగా చేయగలడు. అయితే ఊర్లో పొలం చెసుకుంటూ హమాలీ పనికి పోతే నెలకు 6000 జీతం వస్తుంది జీవితం గడుస్తుంది అనుకున్న వాడికి భార్య హైదరాబాద్ కి పోయి పని వెతుక్కో, నీకు నచ్చిన పని చేయి వస్తే ఆనందంగా ఉంటావు లేకుంటే మళ్ళీ ఊర్లో పని చేసుకుంటావు అని ధైర్యం చెప్తే హైదరాబాద్ కి వచ్చి మొదట హోటల్ లో పనిచేస్తూనే మరోవైపు టీవీ ఛానెల్స్ చుట్టూ తిరిగేవాడట. అలా మొదట ఒక ఛానెల్ లో బిత్తిరి సత్తి అలియాస్ రవి కుమార్ తో కలిసి ఒక వార్తలు చదివే ప్రోగ్రామ్ చేసిన కొమరం ఆ తరువాత జబర్దస్త్ లో వెంకీ మంకీ టీం నుండి పిలుపు తో కెరీర్ మారింది. ఇక కిర్రాక్ ఆర్పీ టీంలో మాకు పశువులంటే ప్రాణం అనే స్కిట్ తో బాగా పేరొచ్చిందని కొమరం పంచుకున్నాడు.

అంతకుముందు హైదరాబాద్ రోడ్ మీద గొడుగులు, ట్రాఫిక్ లో బ్యాగులు అమ్మేవాడినని కొమరం తన జీవితం గురించి చెప్పాడు. ఇక తాను ఎపుడు అన్ని కష్టాలు పడ్డాను ఇన్ని కష్టాలు పడ్డాను అని చెప్పను, ఎందుకంటే అది నాకోసం కష్టపడింది కాబట్టి అంటూ చెప్తాడు. ఇక ముసలామె గెటప్ లో ఫేమస్ అయి కొమరక్కగా మారింది మాత్రం ‘దండోరా’ అనే కార్యక్రమం కోసం ప్రోగ్రామ్ డిజైన్ చేసినపుడు మా ఎమ్మెల్యే క్రాంతి గారి ప్రోత్సాహంతో కొమరక్క క్యారెక్టర్ వచ్చింది. కానీ ఆ పాత్ర ఎంతో మందికి కనెక్ట్ అయింది. అందుకే ఆ పేరుతో నన్ను పిలిస్తేనే నాకు నచ్చుతుంది ఇప్పుడు అంటూ చెబుతాడు కొమరం.
































