Jabardasth Naresh : జబర్దస్త్ అభిమానులకు నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చూడటానికి చాలా పొట్టిగా ఉన్నా తన పంచులతోటి అందరినీ కడుపుబ్బా నవ్విస్తుంటాడు. జబర్దస్త్ కు వచ్చిన అనతి కాలంలోనే బాగా పేరు తెచ్చుకున్నాడు. మొదట చంటి టీం లో ఉన్న నరేష్ తరువాత భాస్కర్ టీం లోకి చేరాడు. నరేష్ వళ్ళ తన టీంకు మంచి పేరు వచ్చిందని భాస్కర్ చాలా సార్లు చెప్పడం జరిగింది. పంచులతోనే కాదు అపుడప్పుడు తన డాన్స్ తో కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాడు. తాజాగా వచ్చిన శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రమోలో నరేష్ డాన్స్ తో ఇరగదీసాడు.

డాన్స్ తో దుమ్ము రేపిన నరేష్…
ఈటీవీలో ప్రసారం అయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ షోకు సంబంధించి ఒక ప్రోమో రిలీజ్ అయింది. ఈ ప్రోమోలో మొదట కమెడియన్ కృష్ణభగవాన్ తన పంచులతో ఎంట్రీ ఇచ్చి అందరినీ నవ్వించాడు. తరువాత హైపర్ ఆదీ, ఆటో రామ్ ప్రసాద్, బుల్లెట్ భాస్కర్ కమెడీ పంచులతో ఆకట్టుకుంటున్నారు. అయితే ప్రమోలో ఇవన్నీ ఒకవైపు ఉంటే నరేష్ డాన్స్ షో కి హైలెట్ గా నిలిచింది.

రామ్ చరణ్ మగధీర సినిమాలోని బంగారు కోడి పెట్ట పాటకు కు నరేష్ డ్యాన్స్ తో దుమ్మలేపాడు. నరేష్ మాస్ డ్యాన్స్ ను చూసి అక్కడ ఉన్న అందరూ ఆశ్చర్యపోయారు. ఇక రష్మీ కంటెంట్ ఉన్న వాడికి కటౌట్ అవసరం లేదురా అంటూ నరేష్ ని పోగిడింది. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతోంది.


































