Jabardasth Racha Ravi : బ్రహ్మానందం గారు టీవీలో చూసి… ఇల్లు కొనడానికి 5 లక్షలు ఇస్తానన్నారు… కానీ : జబర్దస్త్ రచ్చ రవి

0
106

Jabardasth Racha Ravi : జబర్దస్త్ నుండి పేరు తెచ్చుకున్న కమెడియన్స్ లో రచ్చ రవి ఒకరు. అతని బేస్ వాయిస్ కి తన కామెడీ టైమింగ్ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే జబర్దస్త్ నుండి బయటకు వచ్చి రచ్చ రవి సినిమాల్లో కమెడియన్ గా చేస్తున్నాడు. వరుసగా మంచి ఆఫర్స్ అందుకుంటూ సినిమాల్లో బిజీగా ఉన్న రవి ఇటీవలే ‘బలగం’ సినిమాలో ఆటో రాజేష్ గా చాలా బాగా నటించిన విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. తాజాగా యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జబర్దస్త్ గురించి అలాగే తన జీవితం, కుటుంబం గురించి విశేషాలను పంచుకున్నారు.

బ్రహ్మానందం గారు నాకు ఆత్మీయులు…

జబర్దస్త్ నుండి ఫేమస్ అయిన రచ్చ రవి అక్కడి నుండి సినిమాల్లోకి వెళ్లారు. సినిమాల్లోను మంచి పాత్రలను చేస్తూ గుర్తింవు తెచ్చుకుంటున్న ఆయన అవకాశాలతో పాటు ఇండస్ట్రీలో కొంతమంది పెద్దవాళ్ళు నాకు ఆర్థిక మూలాలను నాకు నేర్పించారు అంటూ తెలిపారు. జబర్దస్త్ లో ఉన్నపుడు నాగబాబు గారు తరచూ డబ్బు పొదుపు చేసుకో అని చెప్పేవారంటూ రచ్చ రవి తెలిపారు. ఇక జబర్దస్త్ లో స్కిట్ చూసి బ్రహ్మానందం గారు ఫోన్ చేసి అభినందించారు. ఆ తరువాత ఆయన నన్ను కలిసి నాకు సలహాలు ఇచ్చేవారు. ఆయన దగ్గర ఎన్నో ఆర్థిక సూత్రాలను తెలుసుకున్నానని ఆయన నాకు గురువు లాంటి వారంటూ చెప్పారు రచ్చ రవి.

ఒక ఇల్లు కూడా ఆయనే చూసి వాస్తు అంతా బాగుందని చెప్పి కొనుక్కోమని సలహా ఇచ్చారు. డబ్బు తక్కువపడితే నేనే ఒక ఐదు లక్షలు సహాయం చేస్తాను ఇల్లు కొనుక్కో అని చెప్పారట. చిరంజీవి గారి దగ్గర కూడా రికమెండ్ చేసారట బ్రహ్మానందం గారు. ఇక ఇంటి గృహప్రవేశం అప్పుడు కూడా, గాలి జనార్దన్ రెడ్డి ఇంట్లో ఫంక్షన్ కి వెళ్లినా నా ఇంట్లో గృహప్రవేశం అని వెంటనే వచ్చారు అక్కడ ఎంతో మంది అతిధులు ఉన్నారు కానీ నీ ఇంటికి నేనే అతిధి అందుకే వచ్చాను అని బ్రహ్మానందం గారు చెప్పారు. గృహప్రవేశంకు వచ్చి ఇంట్లో నా బంధువులందరి వద్ద ఫోటోలు తీసుకున్నారు, భోజనం చేసి వెళ్లారు అంటూ రచ్చ రవి తెలిపారు.