Jabardasth Sathyashree : జబర్దస్త్ కామెడీ షోలో మొదటి నుండి లేడీ గెటప్స్ హవా బాగా ఉండేది. ఆ షో వల్ల చాలా మంది లేడీ గెటప్స్ ద్వారా ఫేమ్ తెచ్చుకున్నారు. వినోద్, పవన్, తేజ, శాంతి ఇలా వీళ్లందరు మంచి పేరు, గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ ఒక్కసారిగా జబర్దస్త్ లోకి లేడీ కమెడియన్ గా చాలా ఎపిసోడ్స్ చేసి పేరు గుర్తింపు తెచ్చుకుంది సత్య శ్రీ. అయితే జబర్దస్త్ నుండి సత్య శ్రీ బయటకు వచ్చేసింది. ఇక మొదటిసారిగా ఇంటర్వ్యూల్లో పాల్గొన్న సత్య చంద్ర తో వచ్చిన రూమర్స్ గురించి, జబర్దస్త్ ను వీడడానికి కారణాలను తెలిపింది.

చంద్ర తో పాటే జబర్దస్త్ వీడి ఇతర ఛానెల్ కి వెళ్లాల్సి వచ్చింది…
జబర్దస్త్ లో చమ్మక్ చంద్ర వినోద్ మంచి పెయిర్ గా ఉండేవాళ్ళు, వినోద్ వెళ్ళిపోయాక చమ్మక్ చంద్ర టీం లో సత్య మంచి హిట్ పెయిర్ గా నిలిచింది, ఫ్యామిలీ స్కిట్లు చేసే చంద్ర కు పెయిర్ గా సత్య క్లిక్ అయింది. అయితే నాగబాబు జబర్దస్త్ వీడినపుడు చంద్ర కూడా వెళ్ళిపోయాడు. ఏ సమయంలోనే సత్య కూడా జబర్దస్త్ నుండి వెళ్లి పోయింది. ఇక ఈవిషయం మీద క్లారిటీ ఇచ్చింది సత్య జబర్దస్త్ లాంటి వేదిక మీద తాను నటించడానికి కారణం మా గురువు చంద్ర గారు అందుకే ఆయన వెళ్ళిపోయాక నేను వెళ్ళాను. మొత్తం మా టీం అంతా ఆయనతో పాటు జబర్దస్త్ వీడి వెళ్ళిపోయాము. ఆ తరువాత అదిరింది, ఇప్పుడు కామెడీ నైట్స్ లోనూ చేస్తున్నాం. అయితే ప్రస్తుతం చంద్ర సినిమాల్లో బిజీగా ఉండటం వల్ల ధనరాజ్ టీం లో చేస్తున్నట్లు చెప్పింది.
ఇక చంద్ర, సత్య ల కెమిస్ట్రీ స్కిట్లను హిట్ దారి పట్టిస్తాయి. అందుకే వారి మధ్య ఏదో ఉందనే పుకార్లు వచ్చాయి. ఇక వాటి గురించి కూడా సత్య క్లారిటీ ఇచ్చింది. ఆయన నాకు గురువు గారు, ఇలాంటివి సినిమాల్లో పెద్ద పెద్ద వాళ్ళకే వస్తుంటాయి అలాంటిది ఇక మేమెంత అలాంటి పుకార్లు కామన్ అని లైట్ తీసుకున్నా. మా నాన్న నాకు ఆ వీడియోలను చూపించి ఇలా రాసారు అన్నపుడు భయపడ్డాను జబర్దస్త్ మానేయమని అంటారేమో అని కానీ ఆయన ఇవన్నీ మామూలే నువ్వు ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకుంటున్నావ్ కాబట్టి ఇలాంటివి మామూలే అంటూ అన్నారు.

ఇక జబర్దస్త్ లో కూడా వీటి గురించి నవ్వుకున్నాం అంటూ చెప్పింది సత్య. ఇక అందరూ జబర్దస్త్ వీడిపోతున్నారు దానిపై ఏమంటారు అని అడుగగా నన్ను జబర్దస్త్ సత్యగా పిలిస్తేనే ఆనందిస్తాను, ఇప్పటికి జబర్దస్త్ లో ఆఫర్స్ వస్తే ఖచ్చితంగా వెళ్తాను అంటూ చెప్పింది. ఎవరి కారణాలు వాళ్ళకి ఉంటాయి నాకైతే జబర్దస్త్ లో ఏం సమస్యలు చూడలేదు అంటూ వివరణ ఇచ్చింది.






























