Jabardasth : తెలుగు నాట కామెడీ షోలలో కింగ్ అంటే జబర్దస్త్. టీఆర్పి లో కానీ సక్సెస్ రేట్ లో కానీ జబర్దస్త్ కి మించిన షో ఇంకోటి లేదు. అయితే ఇదంతా గతం. ఇపుడు పరిస్థితి మారిపోయింది. గత వైభవం లేక జబర్దస్త్ అల్లాడుతోంది. టీఆర్పి కోసం నానా తంటాలు పడుతోంది. ఓ వైపు పేరు మోసిన కమెడియన్స్ జబర్దస్త్ కు గుడ్ బై చెప్పారు. కొత్త వాళ్లు ప్రేక్షకులను ఆకట్టుకోడానికి నానా తంటాలు పడుతున్నారు. ఇక జబర్దస్త్ అనగానే మూల స్థంబాల్లాంటి జడ్జెస్ నాగబాబు, రోజా గుర్తొస్తారు.
టీఆర్పి కోసం కామెడీ చేయమంటే అతి చేస్తున్న జబర్దస్త్….

ఒక రకంగా జబర్దస్త్ పుట్టినప్పటినుండి అది ఈ స్థాయికి వచ్చే వరకు నాగబాబు, రోజా జబర్దస్త్ తో పాటు ఉన్నారు. ఇక కారణాలేవైనా మొదట నాగబాబు షో నుండి వెళ్ళిపోయాడు. ఇక ఇటీవలే రోజా కూడా మినిస్టర్ అయిన కారణంగా షోనుండి వెళ్ళిపోయింది. ఇపుడు జడ్జెస్ గా మనో, ఇంద్రజ వస్తున్నారు. ఇక అప్పుడపుడు సదా, శ్రద్ధ, లైలా అంటూ ఎవరో ఒకరు అలరిస్తున్నా ముందు లాగా షోలో సందడి లేదు. ఇక నెమ్మదిగా షోకి రేటింగ్స్ కూడా పడిపోతుండడంతో టీఆర్పి కోసం తెగ కష్టపడుతోంది జబర్దస్త్ టీం. అలా ఏవేవో టీఆర్పి స్టంట్లతో జనాలను విసిగిస్తున్నారు. తాజాగా విడుదలైన జబర్దస్త్ ప్రోమోలో కామెడీ హైలైట్స్ అయ్యాక చివర్లో ఇంద్రజ టీం లీడర్స్ ను ప్రశ్నలు వేయడం వాటికి సమాధానాలు చెప్పడం చూపించారు.
ఇక ఇంద్రజ బుల్లెట్ భాస్కర్ కి, రామ్ ప్రసాద్ కాంట్రోవర్షియల్ ప్రశ్నలను అడిగారు. ఇక ప్రోమో చివర్లో ఇంద్రజ గారిని రామ్ ప్రసాద్ రోజా గారు మినిస్టర్ కాకూడదని దేవుళ్లను కోరుకున్నారని విన్నాను నిజమేనా అంటూ ప్రశ్నించడంతో ఎండ్ అవుతుంది ప్రోమో. ఇక ఈ ప్రోమోకి నెటిజన్స్ స్పందిస్తూ ఇలాంటి టీఆర్పి స్టంట్స్ చాలా చూసాం ఆపండి అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇక మరికొందరు కామెడీ చేస్తే అందరు షో చూస్తారు ఇలాంటి టీఆర్పి స్టంట్స్ అవసరం ఉండదుగా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

































