Jacqueline Fernandez : సంచలనం సృష్టించిన సుఖేష్ చంద్ర శేఖర్ కేసు లో జాక్వెలిన్ కి ప్రమేయం ఉందని ఈడీ వర్గాలు తెలిపాయి. మనీ లాండరింగ్ కు, బెదిరింపులకు పాల్పడి అక్రమాస్థులను సంపాదించిన ఆర్ధిక నేరస్తుడు సుఖేష్ చంద్ర శేఖర్ కు బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ కి సంబంధాలు ఉన్నాయన్నట్లు ఈడీ తేల్చింది. 215 కోట్ల బెదిరింపులు కేసులో జాక్వెలిన్ పేరును ఈడీ చేర్చింది. సుఖేష్ చంద్ర శేఖర్ తో పోలీసులు అరెస్ట్ చేసే వరకు కూడా వీడియో కాల్స్ ద్వారా టచ్ లో జాక్వెలిన్ ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షుల సాక్ష్యం ద్వారా ధ్రువీకరించారు. ఇక చంద్ర శేఖర్ కూడా అధికారుల విచారణలో జాక్వెలిన్ కు చాలా సార్లు బహుమతులు ఇచ్చినట్లు వెల్లడించాడు.

బ్రాండెడ్ బట్టలు.. ఖరిదైన కార్లు…
జాక్వెలిన్ దాదాపు రూ.10 కోట్ల విలువైన బహుమతులు అందినట్లుగా విచారణ లో తెలిసింది. గతేడాది రికార్డు చేసిన స్టేట్మెంట్ ప్రకారం చంద్రశేఖర్ నుండి గూచీ, చానెల్ వంటి బ్రాండ్ల మూడు డిజైనర్ బ్యాగ్స్, జిమ్ వేర్ కోసం రెండు గూచీ దుస్తులను, ఒక జత లూయిస్ విట్టన్ షూస్, రెండు జతల డైమండ్స్ తీసుకున్నట్లుగా ఈడీకి జాక్వెలిన్ తెలిపింది. అలాగే తనకు సుఖేష్ ఇచ్చిన మినీ కూపర్ కారును అతడికి తిరిగి ఇచ్చినట్లు జాక్వెలిన్ తెలిపింది. గతేడాది ఆగస్ట్ 7న సుఖేష్ ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసే వరకు సుఖేష్ తో జాక్వెలిన్ రెగ్యూలర్ గా టచ్ లో ఉన్నట్లు ఈడీ గుర్తించింది. దాదాపు ఆమెకు సంబంధిచిన 7 కోట్ల ఆస్తులను మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ జప్తు చేసింది. ఇప్పటికే చంద్ర శేఖర్ మీద పలు రాష్ట్రాల్లో 32 క్రిమినల్ కేసులు నమోదైయ్యాయి. మూడు కేంద్ర ఏజెన్సీలు, సీబీఐ, ఎన్ఫోర్మెంట్ డైరెక్టరేట్ , ఆదాయపు పన్ను శాఖలు మనీలాండరింగ్ కేసుపై దర్యాప్తు చేస్తున్నాయి. జాక్వెలిన్ కు చంద్ర శేఖర్ తో సంబంధాలు ఉన్నాయని పలుమార్లు ఈడీ జాక్వెలిన్ ను ప్రశ్నించింది.

గతేడాది ఢిల్లీ కి సంబంధించిన ఒక వ్యాపారవేత్తకు బెయిల్ ఇప్పిస్తానని వ్యాపార వేత్త భార్యకు స్పూఫ్ కాల్ చేసి 215 కోట్లు వసూలు చేసాడు. ఢిల్లీ లోని ప్రధాని కార్యాలయం, న్యాయ శాఖ, హోమ్ శాఖ కి సంబంధించిన అధికారి అంటూ పలు మార్లు ఫోన్ చేసి బెయిల్ ఇప్పిస్తానని తమ ఫార్మా కంపెనీకి సహాయం చేస్తానని నమ్మించి 215 కోట్లు వసూలు చేసాడు. సదరు వ్యాపారి భార్య ఫిర్యాదుతో చంద్ర శేఖర్ మోసాలు బయటకు వచ్చాయి.

































