Jagadhish Prathap : ‘పుష్ప’ సినిమా క్రేజ్ నార్త్, సౌత్ అని తేడాలేకుండా తగ్గేదేలే అంటూ ఉపేసింది. ఇండియా మొత్తం పుష్ప మేనియా సాగింది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గరే కాదు అవార్డు ఫంక్షన్స్ లోనూ తగ్గేదేలే అంటూ తన సత్తా చాటుతోంది. ఏ అవార్డు ఫంక్షన్స్ అయినా అన్ని అవార్డులు పుష్ప సినిమా ఖాతాలో పడుతున్నాయి. ఇక ఇటీవల సైమా అవార్డు ఫంక్షన్స్ లో కూడా పుష్ప సినిమా హవా చూపించింది. చాలా కేటగిరీల్లో అవార్డులను కొళ్లగొట్టింది. అలా సినిమాలో హీరోకి ఫ్రెండ్ గా కనిపించిన కేశవ క్యారెక్టర్ చేసిన జగదీష్ ప్రతాప్ కి కూడా బెస్ట్ సపోర్టింగ్ రోల్ కేటగిరీ లో సైమా అవార్డు వచ్చింది.

స్టేజి పైనే ఎమోషనల్ అయిన కేశవ…
పుష్ప సినిమాలో హీరో పాత్ర తరవాత ఎక్కువ నిడివి ఉన్న పాత్ర కేశవ పాత్ర. హీరోకి స్నేహితుడిగా ఉన్న ఈ పాత్రలో నటించిన జగదీష్ ప్రతాప్ సైమా అవార్డు రావడంతో స్టేజి పైన అవార్డు అందుకుంటూ ఎమోషనల్ అయ్యాడు. ఐ లవ్ యు అమ్మ అంటూ చెప్పి తనకు మొదట అవకాశం ఇచ్చిన డైరెక్టర్, తాను సినిమాల్లోకి వెళతానంటే ప్రోత్సాహం ఇచ్చిన వ్యక్తులకు ఇంత వరకు తనకు సినిమా అవకాశాలను ఇచ్చిన వారికి అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు చెప్పారు.

ఇక స్టేజి మీద పాట కూడా పాడాడు. ఇక పుష్ప సినిమాలో అవకాశం ఇచ్చిన సుకుమార్ గారికి అలాగే అల్లు అర్జున్ షూటింగ్ లో తనతో ఉన్న విధానం గురించి చెబుతూ వారికి కృతజ్ఞతలు చెప్పారు. తన ఐదో సినిమానే ఇంత పెద్ద హిట్ అయి అవార్డు రావడంతో పుష్ప సినిమా నా సినిమా కెరీర్ ను మలుపు తిప్పింది అంటూ చెప్పారు.

































