Jagapathi Babu: సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవల సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు హాజరైన సంగతి అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ శతజయంతి వేడుకల సందర్భంగా చంద్రబాబు నాయుడు రజనీకాంత్ ని అతిథిగా ఆహ్వానించాడు. ఈ క్రమంలో ఈ వేడుకలకు హాజరైన రజనీకాంత్ చంద్రబాబు నాయుడు , బాలయ్యా గురించి చాలా గొప్పగా చెప్పుకొచ్చాడు.దీంతో కొందరు వైసీపీ నాయకులు రజినీకాంత్ పై విమర్శలు చేస్తున్నారు.

అంతే కాకుండా కొన్ని సందర్భాల్లో ఆయన స్థాయిని తగ్గించి మరీ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు.
ఈ క్రమంలో రజినీ ఫ్యాన్స్ వైసీపీ నాయకులపై ఫైర్ అవుతున్నారు. అసలు ఎన్టీఆర్ శతజయంతి వేడుకలలో రాజకీయాల గురించి రజనీకాంత్ మాట్లాడలేదని, కేవలం ఎన్టీఆర్ మీద నందమూరి కుటుంబం మీద ఆయనకు ఉన్న అభిమానం వల్ల ఎన్టీఆర్ బాలకృష్ణ మీద పొగడ్తలు కురిపించారని అభిమానులు తెలుపుతున్నారు.
ఇలా వైసిపి నాయకులు రజనీకాంత్ గురించి విమర్శలు చేయడంతో ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైసిపి నాయకులు, భజన అభిమానుల మధ్య పెద్ద మాటల యుద్ధమే జరుగుతుంది. ఈ క్రమంలో రజనీకాంత్ గురించి సీనియర్ నటుడు జగపతిబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Jagapathi Babu: రజనీకాంత్ అబద్ధాలు చెప్పరు..
రజనీకాంత్ తో కలిసి జగపతిబాబు రెండు సినిమాలలో నటించాడు.ఈ క్రమంలో జగపతిబాబు మాట్లాడుతూ..” నేను ఎక్కువగా టీవీలు చూడను. పత్రికలు చదవను. దాంతో ఆయన ఏం మాట్లాడారు ? ఎవరు విమర్శించారనేది నాకు అవగాహన లేదు అంటూ జగపతిబాబు చెప్పుకొచ్చాడు. అయితే రజనీకాంత్ ఎప్పుడు అబద్ధం మాట్లాడాడని, ఆయన నవ్విస్తూనే నిజాలు మాట్లాడుతాడని జగపతిబాబు వెల్లడించాడు. తనని అనేవాళ్లు ఎప్పుడూ అంటూనే ఉంటారు. అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు” అంటూ రజనీకాంత్ ని సమర్థిస్తూ జగపతి బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.































