Janardhan Rao : తెలుగు సినిమాల్లో కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించిన పొలాప్రగఢ జనార్దన్ రావు గారు తన సినిమా విశేషాలను ఇటీవల ఇంటర్వ్యూలో పంచుకున్నారు. జెన్నీ గా బాగా ప్రచుర్యం పొందిన ఈయన సినిమాలే కాకుండా పలు సీరియల్స్ లో కూడా నటించారు. ఇక తన తో పాటు కమెడియన్స్ గా ఎదిగిన ఏవిఎస్, సుత్తి వేలు, బ్రహ్మానందం, బాబు మోహన్, ఐరన్ లెగ్ శాస్త్రి, తనికెల్ల భరణి వంటి వారి గురించి ఆయన జ్ఞాపకాలను పంచుకున్నారు.

నందిని రెడ్డి ఇచ్చిన చెక్ బౌన్స్ అయింది…
పలు సీరియల్స్ లో నటించిన జెన్నీ గారు ఇన్సూరెన్స్ కంపెనీ లో పనిచేస్తూ సినిమాలను చేస్తుండేవారు. ‘యమలీల’ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక సీరియల్స్ లో ఈటీవీ లో అప్పట్లో ప్రసారమయ్యే అన్ని టాప్ దారావాహికల్లో నటించారు. ఇక ఒక సీరియల్ చేసాక ఆ సీరియల్ హిట్ కాకపోతే ఆ సీరియల్ వాళ్ళు ఎపుడో దుకాణం సర్దుతారు. ఇక అలా చెక్ బౌన్స్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు అందులో ఫేమస్ అయినవాళ్లు ఉన్నారు.

డైరెక్టర్ నందిని రెడ్డి ఒక సీరియల్ కి ప్రొడ్యూసర్ గా ఉండి నాకు చెక్ ఇచ్చారు. ఆ చెక్ మీద నో డ్యూస్ అని వాళ్ళే రాసేసి సంతకం చేయమన్నారు. అలా ఎలా చెక్ బౌన్స్ అయితే పరిస్థితి ఏంటి అని అడిగితే ఏం కాదు అన్నారు, సంతకం చేసాను, చివరికి చెక్ బౌన్స్ అయింది. ఇక నందిని రెడ్డి కొంచెం ఫేమస్ అయ్యాక వెళితే అసలు కలవడానికి కూడా ఇష్టపడలేదు బిజీగా ఉంది అని పంపించేశారు. నాకు ఆరోజు కడుపు మండింది ఆవిడ ఆర్థికంగా బాగాలేనపుడు ఇవ్వలేదంటే ఏమో అనుకోవచ్చు కానీ ఇప్పుడు ఆర్థికంగా బాగానే ఉన్నా కలిసి ఒక మాట ఇస్తానని చెప్పినా పెద్దగా బాధపడి ఉండేవాడిని కాదు అంటూ చెప్పారు.































