Jay shah : సోషల్ మీడియా జమానాలో ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎక్కడో ఒకచోట తప్పు చేసి దొరికిపోతుంటారు సెలబ్రిటీలు. ఒకసారి నెటిజన్స్ చేతికి చిక్కారా ఇక ట్రోల్ల్స్ తో ఆడుకుంటారు. దీనికి సినిమా వాళ్ళైనా, రాజకీయ నాయకులైనా ఎవరైనా మినహాయింపు లేదు. ఒక్క మంచి పనితో ఓవర్ నైట్ స్టార్ ఎలా అవుతారో సోషల్ మీడియాలో అలాగే ఒక చిన్న తప్పు వల్ల అంత నెగెటివిటీ ఎదుర్కొంటారు. అందుకే ఈ సోషల్ మీడియా దునియాలో జర జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇపుడు సోషల్ మీడియాలో ట్రోల్ ఎదురకొంటున్నాడు ఒక కేంద్ర మంత్రి కొడుకు. నిజానికి వివాదాస్పద వాఖ్యలు చేసి ఏ పబ్బుల్లోనో దొరికి ట్రోల్ల్స్ కి గురవడం లేదు. కేవలం అతను చేసిన చిన్న సైగ వల్ల నెటిజన్స్ నెగిటివ్ కామెంట్స్ కి బలయ్యాడు.

అమిత్ షా కొడుకు జాతీయ జెండా తీసుకోడానికి నిరాకరణ…
ఆసియా కప్ 2022 గేమ్స్ లో భాగంగా నిన్న దాయాదుల మధ్య పోరు హోరాహోరిగా జరిగింది. ఇండియా పాకిస్థాన్ మధ్య దుబాయ్ వేదికగా మ్యాచ్ జరిగింది. ఇందులో ప్రత్యర్థి పాకిస్థాన్ మీద ఐదు వికెట్ల తేడాతో ఇండియా గెలిచింది. అయితే ఈ మ్యాచ్ చూడటానికి సాధారణ జనం నుండి సెలబ్రిటీల వరకు ఆందరూ ఆసక్తిగా దుబాయ్ వెళ్లారు. ఇక హీరో విజయ్ దేవరకొండ, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా తనయుడు జై షా కూడా ఉన్నారు. మ్యాచ్ గెలిచాక అందరూ భారత జెండ చూపుతూ అనందాన్ని వ్యక్తం చేసారు. ఈలలు గోల చేస్తూ సంతోషాన్ని సెలెబ్రేట్ చేసుకున్నారు.

Did Jay Shah just refuse to hold our national flag! ???? pic.twitter.com/7TzE74zNlD
— Alind Chauhan (@alindchauhan) August 28, 2022
అదే సమయంలో ఒక వ్యక్తి జై షా కు జెండా ఇవ్వబోతుంటే జై షా వద్దు అన్నట్లు నిరాకరించాడు. ఇక ఈ సంఘటనకు సంబంధిచిన వీడియో నెట్టింట్లో ప్రత్యేక్షమైంది. ఇక అంతే జండా తీసుకోడానికి అంత బలుపా అంటూ నెగెటివ్ కామెంట్స్ తో హోరేత్తిస్తున్నారు నెటిజన్స్. ఇక మరో వైపు బీజేపీ ప్రభుత్వం ఇటీవలే ‘హర్ ఘర్ తిరంగా’ అంటూ స్వాత్రంత్ర వేడుకల్లో భాగంగా ప్రతి ఇంటి ముందు భారతీయులు జెండా ఎగురవేసి దేశభక్తి చాటుకొమ్మని ప్రచారం చేస్తే ప్రతి పౌరుడు జెండా ఎగురవేశాడు. కేంద్ర మంత్రి కుమారుడివైన నువ్వు.. జెండా పట్టుకోవడానికి నిరాకరించావు, ఇదేనా నీ దేశభక్తి, సంస్కారం అంటూ ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తూ ఆడుకుంటున్నారు నెటిజన్స్ .































