Jayaprada : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో జయప్రద గురించి తెలియని వాళ్ళు వుండరు. అప్పటిలో చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయినలలో ఒకరుగా వెలిగారు. 1976 లో భూమికోసం సినిమా ద్వారా తెలుగులో 3 నిమిషాల నిడివి వున్నా పాట తో పరిచయం అయ్యింది. మూడు దశాబ్దాల తన సినీ ప్రస్థానం లో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలి వంటి ఆరు భాషలలో దాదాపు 300 పైగా సినిమాలలో నటించింది. 1996లో తెలుగు దేశం పార్టీ తరపున రాజ్యసభకు ఎన్నిక అయినా, కొన్ని కారణాల వలన పార్టీకి రాజీనామా చేసి ములాయం సింగ్ యాదవ్ సమాజ్‌వాదీ పార్టీలో చేరి ఆంధ్ర నా జన్మ భూమి కానీ ఉత్తర ప్రదేశ్ నా కర్మభూమి అన్న నినాదముతో ఉత్తర ప్రదేశ్ లోని రాంపూర్ నియోజవర్గము నుండి 2004 మే 13న లోక్ సభకు ఎన్నికైనది. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జయప్రద ఒక షూటింగ్ సమయంలో వరదలో చిక్కుకున్నప్పటి ఆసక్తికర విషయాలు చెప్పింది.

అంతటి వరదలో కూడా అభిమానూలు…
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జయప్రద తన జీవితంలో జరిగిన కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. జయప్రద, బాలకృష్ణ హీరోగా చేస్తున్న ఒక సినిమా షూటింగులో పాల్గొనడానికి ట్రైన్ లో వెళ్తున్న సమయంలో వరదలో చిక్కుకున్నామని చెప్పారు. ట్రైన్ యాక్సిడెంట్ అవ్వాల్సిన పరిస్థితి తృటిలో తప్పిందని కానీ వరద కారణంగా ఎటు పోలేని పరిస్థితి. మూడు రోజులు ట్రైన్ లోనే గడపాల్సి వచ్చింది. మూడు రోజులు ఆహారం లేక ఆకలికి ఏడుపు వచ్చిందని చెప్పారు. అంతటి పీకలలోతు వరదలోనూ తనని చూడటానికి అభిమానులు వచ్చారని చెప్పుకొచ్చింది. వాళ్ళ అభిమానం చూసి ఏడ్చేసాను అన్నారు.

తరువాత ఒక ఆఫీసర్ జయ ప్రద గారిని కలిసి ఏంటి పరిస్థితి అని తెలుసుకున్నాడని, ఆకలిగా వుంది అని అడుగగా ఇంటి నుంచి భోజనం తెప్పించారని చెప్పారు. ఆ సంఘటన ఇప్పటికీ మరిచిపోలేనని చెప్పారు. తరువాత మీటర్ గేజ్ ట్రైన్ ద్వారా వారిని అక్కడినుంచి పంపించారని చెప్పారు. ఆపరిస్థితిలో చాలా బాధపడ్డానని, తనతో పాటు తన సోదరులు కూడా ఇబ్బంది పడ్డారట. ఇలా తన లైఫ్ లో జరిగి వరద సంఘటన గురించి చెప్పుకొచ్చారు.


































