Jayapradha : జయప్రద అనగానే ఓ అంతులేని కథ, ఒక సీతా కళ్యాణం, ఒక అడవి రాముడు లాంటి సినిమాలు గుర్తొస్తాయి. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం ఇలా అన్ని భాషలలోనూ హీరోయిన్ గా టాప్ కి దూసుకెళ్లిన నటి జయప్రద అసలు పేరు లలిత రాణి. అనుకోకుండా ‘భూమి కోసం’ సినిమాలో వచ్చిన అవకాశంతో ఇక వెను తిరిగి చూసుకునే పని లేకుండా టాప్ హీరోయిన్ అయిపోయింది. 1976 లో వచ్చిన ‘అంతులేని కథ’ సినిమా నటిగా జయప్రద కు మంచి పేరు తెచ్చిపెట్టింది. అటు కమర్షియల్ గాను ‘అడవి రాముడు’ వంటి సినిమాలతో హిట్ కొట్టిన జయప్రద, సాగర సంగమం, దేవత, సిరి సిరి మువ్వ, వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. ఇక కృష్ణ గారితో ఏకంగా 45 సినిమాలను నటించిన జయప్రద హిందీ లో కూడా టాప్ హీరోయిన్ గా అప్పటి టాప్ హీరోస్ అందరితోనూ నటించింది.

దాసరి గారు వద్దని ఏడ్చినా బికినీ వేయించారు…
ఇక తన సినిమా అనుభవాలను పంచుకుంటూ జయప్రద గారు దాసరి గారితో జరిగిన ఒక సంఘటన గురించి చెప్పారు. ఒక సినిమాలో బికినీ వేయాల్సి రాగా వేయనని ఏడ్చారట జయప్రద, కానీ ఆ సినిమాకు దర్శకుడైన దాసరి గారు వేయాల్సిందేనని చెప్పి ఏం కనిపించకుండా సీన్ చేద్దామని హామీ ఇచ్చారట. ఇక అలా ఒక సినిమాలో బికినీ వేసుకున్నారట జయప్రద. ఆ తరువాత ఇప్పటివరకు ఇక ఏ సినిమాలోనూ బికినీ వేయకూడదని నిర్ణయించుకున్నారట. తనకు బికినీ ఇబ్బందిగా ఉంటుందని ఆవిడ అభిప్రాయం. ఇక బాలకృష్ణ అంటే చాలా ఇష్టమని, తనతో కలిసి ఇంకా సినిమాలు చేయాలనుకుంటున్నట్లు తెలిపారు.

ఇక రజనీ, కమల్, తాను బాలచందర్ గారి స్కూల్ నుండి వచ్చాము ఒకేసారి ముగ్గురం స్టార్లుగా ఎదిగాం. ఇక రాజకీయాల్లోకి నేను కమల్ వెళ్ళాము, రజనీకాంత్ రావాలనుకుని కుదరలేదు. అలా ముగ్గురం ఒకేసారి బాలచందర్ గారి శిష్యులుగా వచ్చి ఈ స్థాయికి వచ్చామంటూ చెప్పారు. ఇక మళ్ళీ తెలుగులో నటించాలనుకుంటున్నట్లు త్వరలో ఒక సినిమాతో రాబోతున్నట్లు తెలిపారు.



























