JD Chakravarthy : నా భార్య నాకు విషం పెట్టి చంపాలనుకోలేదు… అదంతా అసలు అపద్దం…: జేడి చక్రవర్తి

0
117

JD Chakravarthy : ‘శివ’ సినిమాతో తెలుగులో పరిచయమైన నాగులపాటి శ్రీనివాస చక్రవర్తి కంటే జేడి చక్రవర్తి అనగానే ప్రేక్షకులకు గుర్తిస్తారు. మొదటి సినిమా క్యారెక్టర్ పేరును తన పేరులో పెట్టుకున్న జేడి చక్రవర్తి శివ, సత్యం, దెయ్యం, ఎగిరే పావురమా, మనీ, మనీ మనీ అంటూ పలు సినిమాల్లో నటించి మంచి గుర్తంపు తెచ్చుకున్నాడు. గురువు ఆర్జీవి బాటలో హిందీలో అనేక సినిమాల్లో నటించిన జేడీ అటు తమిళం, కన్నడ, మాలయం సినిమాల్లో నటించారు. అలాగే దర్శకత్వం కూడా కొన్ని సినిమాలకు చేసారు. తాజాగా డిస్నీ హాట్ స్టార్ లో ‘దయ’ అనే వెబ్ సిరీస్ లో నటించారు. ఆగష్టులో రానున్న ఈ వెబ్ సిరీస్ గురించి ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ తనకు స్లో పాయిజన్ ఇచ్చి చంపాలనుకున్న వ్యక్తి నా భార్య కాదంటూ ట్విస్ట్ ఇచ్చారు.

నాకు పెళ్లి అయిందని ఎవరు చెప్పారు…

జేడి చక్రవర్తి తన కొత్త వెబ్ సిరీస్ దయ గురించి మీడియా ద్వారా బాగా ప్రచారం ఇస్తూ తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఇంట్రస్టింగ్ విషయాలను పంచుకున్నారు. తన పెళ్లి గురించి ప్రశ్న ఎదురుకాగా తాను అసలు పెళ్లి చేసుకున్నట్లు ఎవరు చెప్పారు, తాను ఒక షూటింగ్ లో ఉండగా అమెరికాలో ఉన్న తన అక్క బావ రావడం నాతో ఫోటో దిగడం వల్ల ఆ రోజు పెళ్లి సీన్ షూటింగ్ జరుగుతుందటం వల్ల ఆ పెళ్లి బట్టలలో ఉన్నట్లు వివరించారు.

అలా ఎందుకు మీరు అనుకోరు, నాకు పెళ్లి అని ఎలా కన్ఫర్మ్ చేస్తారు అంటూ ఎదురు ప్రశ్నించారు. ఇక తనకు స్లో పాయిజన్ ఇచ్చింది తన భార్యే అనే విషయం గురించి మాట్లాడుతూ తనకు సన్నిహితంగా ఉండే ఒక వ్యక్తి అని చెప్పాను. అది ఒక మగాడు ఆ విషయాన్నిఏదేదో మార్చి హైప్ కోసం థంబ్ నైల్స్ ఏవేవో పెట్టి స్టోరీ మార్చేశారు అంటూ చక్రవర్తి క్లారిటీ ఇచ్చారు. నమ్మిన వారే మోసం చేయగలరు, నేను బాగా నమ్మిన వ్యక్తే నన్ను చంపాలని చూసారు అంటూ చక్రవర్తి తెలిపారు.