Jd Chakravarthy: ఎన్నో తెలుగు సినిమాలలో నటుడిగా నటిస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటుడు జేడీ చక్రవర్తి కేవలం హీరోగా మాత్రమే కాకుండా విలన్ గా కూడా నటించి మెప్పించారు. ప్రస్తుతం ఈయన తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా ప్రారంభించి వరుస సినిమాలలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఈ క్రమంలోనే దయ అనే వెబ్ సిరీస్ లో నటించిన చక్రవర్తి త్వరలోనే ఈ సిరీస్ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈయన తన వ్యక్తిగత విషయాల గురించి తెలియజేస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఈ సందర్భంగా జెడి చక్రవర్తి మాట్లాడుతూ ఒకప్పుడు తనపై విష ప్రయోగం చేశారని తెలియజేశారు.అయితే తనపై ఇలాంటి దారుణానికి పాల్పడిన వ్యక్తి ఎవరు ఏంటి అనే విషయాలను మాత్రం వెల్లడించకపోయినా దాదాపు 8 నెలల పాటు తనపై విష ప్రయోగం జరిగిందని తన బాడీలోకి స్లో పాయిజన్ ఇచ్చారంటూ తెలియజేశారు.

Jd Chakravarthy: కషాయంలో కలిపి పాయిజన్ ఇచ్చారు…
ఇలా కొద్దిరోజుల తర్వాత తనకు పూర్తిగా బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చిందని,ఎంతోమంది డాక్టర్లను కలిసి ట్రీట్మెంట్ చేయించుకున్న ఏమాత్రం ఫలితం లేకుండా పోయింది ఒకసారి తన క్లోజ్ ఫ్రెండ్ ఒక డాక్టర్ ను సజెస్ట్ చేయడంతో వెళ్లాను ఆయన కొన్ని టెస్టులు చేశారు.ఇలా టెస్ట్ చేసిన అనంతరం దాదాపు 8 నెలల నుంచి తనకు స్లో పాయిజన్ ఇస్తున్నారని అందుకే అలాంటి సమస్య తలెత్తింది అంటూ ఈ సందర్భంగా చక్రవర్తి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.































