Jogi Naidu : ఝాన్సీ తో ప్రేమ, పెళ్లి, విడాకులు… మమ్మల్ని కలపాలని చిరంజీవి, బ్రహ్మానందం చాలా ప్రయత్నించారు…: నటుడు జోగి నాయుడు

0
273

Jogi Naidu : అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరీర్ మొదలు పెట్టిన జోగి నాయుడు గారు జెమినీ టీవీలో వస్తున్న జోగి బ్రదర్స్ కార్యక్రమం ద్వారా బాగా ఫేమస్ అయ్యారు. ఇక అసిస్టెంట్ డైరెక్టర్ గా పలు డైరెక్టర్స్ తో పనిచేస్తూనే మరోవైపు సినిమాల్లో కమెడియన్స్ గా కూడా చేసారు. ఇక జెమినీ టీవీలో పనిచేస్తున్న సమయంలోనే యాంకర్ ఝాన్సీ గారితో పరిచయం ఏర్పడి పెళ్లి చేసుకున్నారు. ఇక జోగి నాయుడు గారు తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన వ్యక్తిగత జీవితం గురించి పంచుకున్నారు.

ప్రేమించుకున్నాం… వద్దనుకున్నాం…

ఝాన్సీ గారితో పరిచయం ఏర్పడ్డాక ఇద్దరం ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం. మాకు ఒకపాప పుట్టాక కూడా చాలా ఆనందంగా ఉన్నాం. అయితే ఇద్దరం కెరీర్ లో బాగా పైకి వచ్చాము, తాను యాంకర్ గా మంచి స్టేజి కి వెళ్ళింది అలాగే నేను ఆర్టిస్ట్ గా ఒకవైపు స్టూడియో పెట్టి మంచి పీక్స్ లో ఉన్న సమయంలో మా మధ్య చిన్న చిన్న మనస్పర్తలు మొదలయ్యాయి.

నేను కాంప్రమైస్ అవ్వాలని చాలా ఏళ్ళు చూసినా పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగి నచ్చజెప్పినా ఝాన్సీ కలిసి ఉండటానికి అంగీకరించలేదు. చిరంజీవి గారు బ్రహ్మానందం గారు కూర్చోబెట్టి చాలా మాట్లాడారు కానీ ఝాన్సీ ఒప్పుకోలేదు విడిపోవాలని నిర్ణయించుకుంది. అలా విడిపోవాల్సి వచ్చింది. బ్రహ్మానందం గారు మా కుటుంబ పెద్దగా చాలా నచ్చజెప్పారు, ఆయనకు అవసరం లేకపోయినా చేసారు కానీ విడిపోయాము అంటూ తెలిపారు. ఇక నాకు నా కూతురంటే చాలా ఇష్టం. మళ్ళీ నా తల్లిదండ్రులు వేరే పెళ్లి చేసుకోమని నచ్చజెప్పి మరో పెళ్లి చేసారు అంటూ మాట్లాడారు.