Jogi Naidu : అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరీర్ మొదలు పెట్టిన జోగి నాయుడు గారు జెమినీ టీవీలో వస్తున్న జోగి బ్రదర్స్ కార్యక్రమం ద్వారా బాగా ఫేమస్ అయ్యారు. ఇక అసిస్టెంట్ డైరెక్టర్ గా పలు డైరెక్టర్స్ తో పనిచేస్తూనే మరోవైపు సినిమాల్లో కమెడియన్ గా కూడా చేసారు. ఇక జెమినీ టీవీలో పనిచేస్తున్న సమయంలోనే యాంకర్ ఝాన్సీ గారితో పరిచయం ఏర్పడి పెళ్లి చేసుకున్నారు. ఇక జోగి నాయుడు గారు తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారు.

సౌందర్య డూప్ గా చేశా…
అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తూనే మరోవైపు యాంకరింగ్ చేసుకుంటూ ఉన్న జోగి నాయుడు గారు కృష్ణ వంశీ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసేవారు. అలా అంతఃపురం సినిమా టైములో ఒక చిన్న సీన్ లో కూడా కనిపిస్తాను. ఇక ఒక సీన్ లో సౌందర్య గారితో యాక్షన్ సన్నివేశం సమయంలో ఆమె రాకపోవడంతో నన్ను సౌందర్య డూప్ గా పెట్టి కృష్ణవంశీ గారు సీన్ షూట్ చేసారు. విలన్లు ఆమెను తరిమే సీన్ అలా చేసాం అంటూ చెప్పారు.

ఇక ఆ సినిమా సమయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ మంచి స్నేహితుడు అయ్యాడు. ఇప్పటికీ బాగా క్లోజ్ గా ఉంటుంటాం. ఒక నాలుగేళ్ళ క్రితం వరకు కూడా ఇద్దరం కలిస్తే జోకులేసుకుని నవ్వుకునేవాళ్ళం. ఆ త్రివిక్రమ్ కూడా సినిమాల్లో చెప్తా స్వామి అంటాడు ఇంతవరకు మంచి ఆఫర్ ఇవ్వలేదు. ఏమైనా అంటే టైం రాలేదు అంటాడు. ఇక డైరెక్టర్ పరుశురాం కూడా పిన్ని కొడుకు, నా తమ్ముడే కానీ తన సినిమాల్లో కూడా నేను లేను నాకు అవకాశం ఇవ్వలేదు అంటూ చెప్పారు జోగి నాయుడు.