Jordar Sujatha: రాకేష్ కి ఎంత కట్నం ఇచ్చానంటే… రాకేష్ స్కిట్ లో చేస్తే నాకిచ్చే రెమ్యూనరేషన్…: జోర్ధార్ సుజాత

0
751

Jordar Sujatha : జబర్దస్త్ ద్వారా ఎంతో మంది కమెడియన్స్ మంచి గుర్తింపుతో నేమ్ ఫేమ్ తో సినిమాల్లో కూడా అవకాశాలను అందుకుంటున్నారు. ఇక అలా జబర్దస్త్ లో అడుగుపెట్టి ప్రస్తుతం అందులో టీం లీడర్ గా ఉంటూ మరో వైపు సినిమాల్లో కూడా చేస్తున్న కమెడియన్ రాకింగ్ రాకేష్. ఇక జోర్ధార్ వార్తలు చదువుతూ ఫేమస్ అయింది సుజాత. రాకేష్ సుజాత ఇద్దరూ ఒక ఇంటర్వ్యూలో పరిచయం అయి ఆ తరువాత ప్రేమించుకున్నారు. ప్రస్తుతం ఇద్దరూ కలిసి పలు షోలలో సందడి చేస్తున్న వీరు పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. తాజాగా సుజాత నటించిన ‘సేవ్ ది టైగర్’ సిరీస్ తో అలరించింది. తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన లవ్ స్టోరీ, కెరీర్ గురించి పంచుకుంది.

రాకేష్ కి కట్నం…

సుజాత పెళ్లయ్యాక మొదటి సారి ఇంటర్వ్యూలో పాల్గొంటూ తన వైవాహిక జీవితం గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది. ప్రేమ విషయం బయటికి వచ్చినా పెళ్లి చేసుకోడానికి తన సినిమా ప్రాజెక్ట్స్ అలాగే రాకేష్ సినిమా ప్రాజెక్ట్స్ ఉండటం వల్ల ఇప్పుడు చేసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. ఇక పెళ్లి ఖర్చు మొత్తం తానే పెట్టుకున్నాడని మా కుటుంబం నుండి ఎటువంటి కట్నకానుకలు తీసుకోలేదని సుజాత, రాకేష్ గురించి తెలిపారు.

తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి మొత్తం తానే ఖర్చు పెట్టాలని పెళ్లి చీరల్తో మొదలు బంగారం కూడా తానే తీసిచ్చాడు, నా కుటుంబం నుండి రూపాయి కూడా ఆశించలేదు అంటూ చెప్పారు సుజాత. ఇక జబర్దస్త్ సమయంలో స్కిట్స్ చేసేటపుడు కూడా టీం లీడర్ గా నాకు రెమ్యూనరేషన్ ఇచ్చేవాడు. తమ్ముడు తమ్ముడే పేకాట పేకాట అన్నట్లుగా నా రెమ్యూనరేషన్ నేను తీసుకున్నాను. అయితే ఇద్దరం మా పర్సనల్ లైఫ్ లో ఖర్చుల గురించి అన్నింటినీ చర్చించే నిర్ణయం తీసుకుంటాం, అందరూ కలిసి ఒకేచోట ఉంటాం అంటూ తన కొత్త జీవితం గురించి చెప్పారు సుజాత.