Josh Ravi : చిరంజీవి అన్నయ్య… ఒక్కసారి ఈ తమ్ముడు బాధ విను…: జోష్ రవి

0
106

Josh Ravi : జబర్దస్త్ నుండి వచ్చి కమెడియన్ గా మంచి ఫేమ్ తెచ్చుకున్న జోష్ రవి జబర్దస్త్ కంటే ముందు నాగచైతన్య ‘జోష్’ సినిమాలో ఇండస్ట్రీలో గుర్తింవు తెచ్చుకున్నాడు. చాలా సినిమాల్లో కమెడియన్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంటూ ముందుకు వెళ్తున్న రవి ‘గుండె జారీ గల్లంతయ్యిందే’ సినిమాలో రైటర్ హర్షవర్ధన్ కి మధ్య చిన్న మనస్పర్తలు వచ్చినా ఆ సినిమాతో రవికి కమెడియన్ గా మంచి గుర్తింపు మాత్రం వచ్చింది. ఇక చిరంజీవి గారంటే ఎంతో ఇష్టమని, చిరంజీవి కోసం మాత్రమే ఇండస్ట్రీకి వచ్చానంటూ చెప్తుంటాడు.

ఆరోజు చాలా బాధాపడ్డాను…

చిరంజీవి గారి సినిమాలో ఒక చిన్న పాత్రయినా సరే చేసి ఆయన పక్కన నటించాలన్నదే కోరిక అంటూ చెప్పే జోష్ రవి మీలో ఎవరు కోటీశ్వరుడు చిరంజీవి చేసినపుడు ఆయన మొత్తం సినిమాల నుండి స్పూఫ్స్ ను జోష్ రవి చేసాడు. అలా చిరంజీవి గారికి తనని పరిచయం చేసుకున్న రవి తనకు చిరంజీవి అంటే ఎంత ఇష్టమో చెప్పారు. అలా ఆచార్య సినిమా టైంకి చిరంజీవి గారి వద్దకు వెళ్లి ఒక క్యారెక్టర్ ఇవ్వమని అడగడంతో ఆయన సరేనన్నారు.

అలా ఆచార్య సినిమాలో కాజల్ పక్కన నటించినా ఆమె మొత్తం సీన్స్ తీసేయడం వల్ల జోష్ రవి కూడా సినిమాలో ఎక్కడా కనిపించడు. ఒక్కసారైనా సిల్వర్ స్క్రీన్ మీద తన అభిమాన నటుడు చిరంజీవి పక్కన కనిపించాలని అనుకున్న జోష్ రవికి నిరాశ మిగిలింది. అందుకే ఒక్కసారైనా చిన్న అవకాశం అయినా ఆయన పక్కన నటించాలని ఉందంటూ జోష్ రవి తెలిపారు. తాజాగా వచ్చిన వెబ్ సిరీస్ దయ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు జోష్ రవి.