Josh Ravi : జబర్దస్త్ నుండి వచ్చి కమెడియన్ గా మంచి ఫేమ్ తెచ్చుకున్న జోష్ రవి జబర్దస్త్ కంటే ముందు నాగచైతన్య జోష్ సినిమాలో ఇండస్ట్రీ లో గుర్తింవు తెచ్చుకున్నాడు. చాలా సినిమాల్లో కమెడియన్ గా తనకంటూ మాంచి గుర్తింపు తెచుకుంటూ ముందుకు వెళ్తున్న రవి ‘గుండె జారీ గల్లంతయ్యిందే’ సినిమాతో కమెడియన్ గా మంచి గుర్తింపు వచ్చింది. ఇక చిరంజీవి గారంటే ఎంతో ఇష్టపడే రవి చిరంజీవి కోసం మాత్రమే ఇండస్ట్రీ కి వచ్చానంటూ చెప్తుంటాడు.

జబర్దస్త్ చేయను… ఎందుకంటే…
సినిమా ఇండస్ట్రీ లో మంచి ఆర్టిస్ట్ అవ్వాలనుకునే వారికీ జబర్దస్త్ మంచి ప్లాట్ ఫామ్. నిజానికి ఎంతో మంది నేడు ఇండస్ట్రీ లో ఉన్న కమెడియన్స్ జబర్దస్త్ ద్వారానే గుర్తింపు తెచ్చుకున్నారు. జోష్ రవి కూడా మొదట్లో జబర్దస్త్ లో కనిపించేవాడు. ఇప్పటికి గెస్ట్ గా అప్పుడప్పుడు వేల్లే జోష్ రవి జబర్దస్త్ మానేయడానికి కారణాలను చెప్పారు.

జబర్దస్త్ ఇప్ప్పటికి ఫాలో అవుతూ స్కిట్స్ చూస్తుంటానని నాకు మొదట్లో అన్నం పెట్టిన జబర్దస్త్ అంటే నాకు గౌరవం ఉన్న నా లక్ష్యం సినిమాలు అందుకే సినిమాల్లో చేస్తాను కానీ జబర్దస్త్ చేయను. ఇప్పటికి మా జూనియర్స్ ఎవరైనా స్కిట్ లో కనిపించమని అడిగితే అతిధిగా వెళ్తుంటాను. అలా ఎపుడు పిలిచినా వెళ్తాను కానీ రెగ్యులర్ గా చేయను. మ దట్లో జబర్దస్త్ చేసినపుడు నాకు రెండు వేల రూపాయలు ఇచ్చేవారు ఇపుడు రెండు లక్షలు ఇచ్చినా వెళ్ళను అంటూ రవి తెలిపారు.