Josh Ravi : జబర్దస్త్ నుండి వచ్చి కమెడియన్ గా మంచి ఫేమ్ తెచ్చుకున్న జోష్ రవి జబర్దస్త్ కంటే ముందు నాగచైతన్య జోష్ సినిమాలో ఇండస్ట్రీ లో గుర్తింవు తెచ్చుకున్నాడు. చాలా సినిమాల్లో కమెడియన్ గా తనకంటూ మాంచి గుర్తింపు తెచుకుంటూ ముందుకు వెళ్తున్న రవి గుండె జారీ గల్లంతయ్యిందే సినిమాలో రైటర్ హర్షవర్ధన్ కి మధ్య చిన్న మనస్పర్తలు వచ్చిన ఆ సినిమాతో రవికి కమెడియన్ గా మంచి గుర్తింపు మాత్రం వచ్చింది. ఇక చిరంజీవి గారంటే ఎంతో ఇష్టపడే రవి చిరంజీవి కోసం మాత్రమే ఇండస్ట్రీ కి వచ్చానంటూ చెప్తుంటాడు.

వాళ్ళను ఇండస్ట్రీ కి పరిచయం చేసింది నేనే…
ఇండస్ట్రీ కి వచ్చిన ఇన్నేళ్ల కాలంలో చేసింది 100 సినిమాలు అయినా గుర్తింపు బాగా వచ్చినవి ఒక 20 సినిమాలు ఉంటాయంటూ చెప్పిన జోష్ రవి. సినిమా ఇండస్ట్రీ కి వచ్చినపుడు ఎలా ఉన్నానో ఇపుడు అలానే ఉన్నానట్టు చెప్పారు. క్యారవాన్ వాడటం లాంటివి అలవాటు లేదని షేరింగ్ గా వెహికల్ పంపిన రెమ్యూనరేషన్ విషయంలో కానీ ఎలాంటి డిమాండ్ చేయనంటూ నాకు ఎవరైనా స్ట్రగల్ అవుతూ ఆర్టిస్ట్ కనిపిస్తే ఖచ్చితంగా హెల్ప్ చేస్తానని చెప్పారు.

చిరు ఫ్యాన్ అయ్యుండి ఆయన లాగా ఉండకపోతే ఎలా అంటూ రవి చెప్తారు. అలా జబర్దస్త్ రచ్చరవి, బుల్లెట్ భాస్కర్ ఇద్దరిని కొన్ని ఈవెంట్స్ అపుడు కో యాక్టర్ గా తీసుకుని బ్రహ్మానందం గారికి పరిచయం చేసాను. ఇక రంగస్థలం మహేష్ ను ఎండలో నిల్చొని అవకాశాల కోసం తిరుగుతుంటే మారుతి గారికి పరిచయం చేశాను అంటూ రవి చెప్పారు.