Jr NTR: నందమూరి తారక రామారావు వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఎన్టీఆర్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు. బాల రామాయణం సినిమా ద్వార చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ ఆ తర్వాత నిన్ను చూడాలని ఉంది అనే సినిమాతో హీరోగా మారాడు. ఇలా ఆది, సింహాద్రి, స్టూడెంట్ నెంబర్ వన్ వంటి ఎన్నో సూపర్ హీట్ సినిమాలలో నటించి సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన ఎన్టీఆర్ గతే విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు.
ఇదిలా ఉండగా తాజాగా జూనియర్ ఎన్టీఆర్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
సినిమాలలోకి రాకముందు ఎన్టీఆర్ బుల్లితెర మీద ప్రచారం అయిన టీవీ సీరియల్ లో నటించిన వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బిగ్ బాస్, మీలో ఎవరు కోటీశ్వరుడు వంటి షోలకు పోస్టుగా వ్యవహరించి బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అయితే ఎన్టీఆర్ హీరోగా మారక ముందే సీరియల్లో నటించాడని చాలా మందికి తెలియదు. ఎన్టీఆర్ నటించిన ఆ సీరియల్ వివరాలలోకి వెళితే…
ఈటీవీ మొదలు పెట్టిన కొత్తలో భక్త మార్కండేయ అనే సీరియల్ ప్రసారం అయింది. ఈ సీరియల్ లో జూనియర్ ఎన్టీఆర్ మార్కండేయుడిగా నటించాడు. ఈ సీరియల్ కొంతకాలం మాత్రమే ప్రచారం అయినప్పటికీ శివుడి భక్తుడిగా ఎన్టీఆర్ అందరి మనసులు గెలుచుకున్నాడు.
ఎన్టీఆర్ మార్కండేయుడు గెటప్‌లో ఉన్నప్పటి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఎన్టీఆర్ తన 30వ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నాడు.
కొరటాల శివ దర్శకతవంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల ప్రారంభం అయ్యింది.
ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిన జూనియర్ ఎన్టీఆర్ తదుపరి సినిమాలు కూడా పాన్ ఇండియా రేంజ్ లో ఉండబోతున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…