Jr. NTR -Mehar Ramesh: అప్పట్లో ఎన్టీఆర్ కి ఇంత పరిణితి లేదు.. మెహర్ రమేష్ కామెంట్స్ వైరల్?

Jr. NTR -Mehar Ramesh: మెహర్ రమేష్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్లాప్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న ఈయన ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి 153 వ సినిమా భోళా శంకర్ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పనులను ప్రారంభం చేసుకుంది. ఇకపోతే మెహర్ రమేష్ తన సినీ కెరియర్లో చేసిన సినిమాలన్నీ కూడా ఫ్లాప్ సినిమాలు గానే మిగిలిపోయాయి.

బిల్లా సినిమా మినహా ఎన్టీఆర్ తో ఈయన చేసిన కంత్రి, శక్తి సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి.ఈ క్రమంలోనే ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో జూనియర్ ఎన్టీఆర్ మెహర్ రమేష్ మధ్య దూరం పెరిగిందనే వార్తలు వినిపించాయి. ఇకపోతే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి మెహర్ రమేష్ కు ఇదే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నలకు మెహర్ రమేష్ ఆసక్తికరమైన సమాధానాలు చెప్పారు.

ఈ క్రమంలోనే ఈయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్ నటించిన కంత్రి సినిమా హిట్ అయింది అంటూ సమాధానం చెప్పారు. ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్ కి మించి వసూలు వచ్చాయని అమెరికాలో యమదొంగ సినిమా కన్నా మంచి వసూలు రాబట్టిందని తెలిపారు. ఇక శక్తి సినిమా అనుకున్నంత స్థాయిలో రాలేదని అయితే ఆ సమయంలో ఎన్టీఆర్ సరైన పరిణితి లేదు అంటూ ఈ సందర్భంగా మెహర్ రమేష్ కామెంట్స్ చేశారు.

Jr. NTR -Mehar Ramesh: కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్న తారక్…

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ గురించి ఈయన చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఇదే విషయం గురించి ఎన్టీఆర్ అభిమానులు స్పందిస్తూ నిజంగానే ఎన్టీఆర్ అప్పట్లో కథల ఎంపిక విషయంలో సరైన కథను ఎంపిక చేసుకోలేదని ప్రస్తుతం కథల ఎంపిక విషయంలో ఎంతో పరిణీతి చెందారంటూ కామెంట్లు చేస్తున్నారు.