Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన RRR సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఎలాంటి ఆదరణ సంపాదించుకుందో మనకు తెలిసిందే. ఇలా ఈ సినిమా ఎంతో ఆదరణ పొందడమే కాకుండా ఏకంగా ఆస్కార్ నామినేషన్లు లో కూడా నిలవడంతో చిత్ర బృందం అమెరికాలో పాల్గొని పెద్ద ఎత్తున వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు.
అయితే ఈ ఇంటర్వ్యూల విషయంలో ఎన్టీఆర్ కి కాస్త అవమానం జరుగుతూనే ఉందని మొదటి నుంచి అభిమానులు మండిపడుతున్నారు.హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ కేవలం రామ్ చరణ్ ను మాత్రమే అవార్డు వేడుకలకు ఆహ్వానించి ఎన్టీఆర్ ను ఆహ్వానించలేదని మండిపడ్డారు దాంతో ఏకంగా హెచ్సీఏ ఎన్టీఆర్ ని పిలిచిన రాలేకపోయానని చెప్పారు అంటూ వివరణ ఇవ్వాల్సి వచ్చింది.
ఇలా ఎన్టీఆర్ కు అవమానం జరగడంతో అభిమానులు మండిపడుతూ ఉన్నారు. ఇకపోతే ఎన్టీఆర్ కూడా ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. కానీ రామ్ చరణ్ మాత్రం తాజాగా పాడ్ కాస్ట్ షో లోపాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన తన హాలీవుడ్ డెబ్యూ గురించి పలు విషయాలను తెలియజేశారు. ఇలా ఎన్నో విషయాల గురించి మాట్లాడుతున్న తరుణంలో ఈ కార్యక్రమం హోస్ట్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ తనని సైడ్ యాక్టర్ అంటూ సంబోధించారు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇలా తమ హీరోని సైడ్ యాక్టర్ అంటూ మాట్లాడటంతో ఎన్టీఆర్ అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఎంతో అద్భుతమైన నటుడిని పట్టుకొని ఎంత మాట అన్నారు అంటూ ఈ విషయంపై భారీగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. హెచ్సీఏ స్పాట్ లైట్ అవార్డ్స్ విషయంలో కూడా ఎన్టీఆర్ ని తక్కువచేసి మాట్లాడారు అంటూ ఎన్టీఆర్ అభిమానులు ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…