Jr.NTR: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇలా స్టార్ హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన నేడు పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటున్నారు.
ఈ క్రమంలోనే ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా గతంలో పలు ఇంటర్వ్యూలలో ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో ఎన్టీఆర్ మాట్లాడుతూ తన తల్లి గురించి పలు విషయాలు వెల్లడించారు. చిన్నప్పుడు తను బాగా అల్లరి చేసేవాన్ని అయితే అమ్మ చాలా సహనంతో భరించేదని తెలిపారు. ఇక నా అల్లరితో ఓపిక నశించిపోయిన అమ్మ తనని బాగా కొట్టేదని కూడా తెలిపారు.
అమ్మకు నేనంటే చాలా ప్రాణం కానీ తనను ఎప్పుడు గారాబం చేయలేదని తెలిపారు. అమ్మ అలా ప్రవర్తించడం వల్లే నేను వాస్తవంలో బ్రతకడం నేర్చుకున్నానని ఎన్టీఆర్ తెలిపారు. అమ్మే నా బలగం అంటూ ఈ సందర్భంగా ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా ఈయన 2009 ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్న విషయం మనకు తెలిసిందే.
ఇలా ప్రచార కార్యక్రమాలలో ఎన్టీఆర్ రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలు పాలయ్యారు.ఈ ప్రమాదం నుంచి ఎన్టీఆర్ క్షేమంగా బ్రతికి బయటపడ్డారు. ఇలా ప్రమాదం జరిగినప్పటి నుంచి ఈయన ఇప్పటికీ ఎక్కడికైనా ప్రయాణం చేయాలి అంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారని తెలుస్తుంది. ఇక తన భార్య గురించి కూడా మాట్లాడుతూ లక్ష్మీ ప్రణతి తనకు భార్యగా రావడం తన అదృష్టం అని తెలిపారు. అయితే తనకు ఇద్దరు కుమారులు కాగా కూతురు లేని లోటు అలాగే ఉండిపోయిందని ఎన్టీఆర్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…