Jr.Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రమాదం నుంచి తప్పించుకున్నారనే విషయం తెలియడంతో ఆయన అభిమానులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. అసలు ఎన్టీఆర్ ప్రమాదం నుంచి బయటపడటం ఏంటి అసలు ఏం జరిగిందనే విషయాన్నికి వస్తే ఎన్టీఆర్ తన భార్య పిల్లలతో కలిసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం జపాన్ వెళ్లిన సంగతి మనకు తెలిసిందే.
ఇలా జపాన్లో వీరంతా వారం రోజులపాటు ఎంజాయ్ చేశారు. ఇక న్యూ ఇయర్ కి గ్రాండ్ వెల్కమ్ చెప్పిన అనంతరం ఎన్టీఆర్ ఈరోజే హైదరాబాద్ చేరుకున్నారు. అయితే ఈయన జపాన్ వదిలి హైదరాబాద్ వచ్చిన వెంటనే జపాన్ లో పెద్ద ఎత్తున భూకంపం వచ్చింది. దీంతో ఒక్కసారిగా అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు అయితే జపాన్ భూకంపంపై ఎన్టీఆర్ చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.
జపాన్ భూకంపం గురించి ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ వారం రోజులు పాటు మేము అక్కడే ఉన్నామని ఈరోజు తాను హైదరాబాద్ వచ్చానని తెలిపారు. ఇలా జపాన్ లో భూకంపం రావడం నిజంగా బాధాకరం. ఇలాంటి కష్టతర పరిస్థితులను ఎదుర్కొంటున్నటువంటి వారందరికీ ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే జపాన్లో భూకంపానికి గురైనటువంటి బాధితులందరూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను అంటూ ఎన్టీఆర్ పోస్ట్ చేశారు.
వారం రోజులు అక్కడే ఉన్నాను..
ఇల వారం రోజులపాటు తాను కూడా అక్కడే ఉన్నాను ఇప్పుడే హైదరాబాద్ వచ్చాను అంటూ ఈయన పోస్ట్ చేయడంతో బహుశా ఒక్కరోజు లేట్ అయిన ఎన్టీఆర్ తన కుటుంబం కూడా ప్రమాదంలో పడి ఉండేదని ఈయన ప్రమాదం నుంచి తప్పించుకున్నారు అంటూ అభిమానులు ఈ పోస్ట్ పై కామెంట్లు చేస్తూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఎన్టీఆర్ హైదరాబాద్ రావడంతో త్వరలోనే దేవర సినిమా షూటింగ్లో బిజీ కాబోతున్నారని తెలుస్తోంది.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…