Junior NTR : నందమూరి వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తారక్ తాత కు తగ్గ మనవడు అని ఎపుడో నిరూపించుకున్నాడు. నటన డైలాగ్ డిక్షన్ వీటిలో ఎన్టీఆర్ ను కొట్టేవాళ్ళు లేరు అనేలా నిరూపించుకున్నాడు. ఇక మొదట్లో కాస్త బోద్దుగా ఉన్నా కూడా డాన్స్ లు ఇరగదీసాడు. కానీ రాను రాను బాగా లావుగా మారి ‘రాఖీ’ సినిమా సమయానికి చాలా లావుగా హీరోలా ఏమాత్రం లేడు ఎన్టీఆర్. ఇక తన ఆహారం అలవాట్ల వళ్లే అలా లావుగా తయారయ్యానంటూ బాగా తినడం తాత దగ్గర నేర్చుకున్నా అంటూ ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ చెప్పిన మాటలు మరోసారి వైరల్ అయ్యాయి.

నేనొక్కడినే ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తినేవాడిని…
తాతయ్యను కలవకముందు చాలా తక్కువ ఫుడ్ తినేవాడిని అయితే ఎపుడైతే తాతయ్యతో కలిసి తినడం అలవాటైందో అప్పటి నుండి ఫుడీ అయిపోయాను. ఆయన మంచి భోజన ప్రియులు అలానే నన్ను తయారుచేసేసారు. బావార్చి బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ నలుగురు తినగలిగేది నేను ఒక్కడినే తినేసేవాడిని అంటూ చెప్పారు. అయితే ఎంతమంది చెప్పినా జాగింగ్ చేయి వర్క్ అవుట్ చేయి అని వినేవాడిని కాదు. మొదటి సారి రాఖీ సినిమా చూసినపుడు నేను ఆ పాత్రకు న్యాయం చేయలేకపోతున్నానని అనిపించింది.

స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు నాకు నేనే నచ్చలేదు. అప్పుడు తగ్గాలని నిర్ణయించుకున్నా, తినాలనుకుంటే ఇప్పుడు బిర్యానీ అలా తినగలను కానీ ఇపుడున్న యంగ్ హీరోస్ అందరూ తమ శరీరాకృతి మీద ఫోకస్ చేస్తున్నారు, అన్ని విషయాల్లోనూ జాగ్రత్త పడుతున్నారు. అలా నేను ఉండాలి అనిపించింది అలా ఉంటేనే నేను ఏ పాత్ర చేసినా దానికి న్యాయం చేయగలనని అనిపించింది అంటూ ఆయన ఆహారపు అలవాట్లను ఎలా సినిమా కోసం మార్చుకున్నారో తెలిపారు.
































