Junior NTR : జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లోకి వచ్చి స్వతహాగా ఎదిగి ఇప్పుడు నందమూరి లెగసీని కాపాడుతూ అగ్రహీరోగా కొనసాగుతున్నాడు. తాత పేరు చెప్పుకుని వారసాత్వంతో ఇండస్ట్రీ లోకి వచ్చాడు అనే కంటే తన తాత పేరు మాత్రమే పెట్టుకుని కష్టపడి ఒక్కోమెట్టు ఎక్కుతూ అవమానాలను భరిస్తూ సినిమాల్లో అగ్ర స్థానానికి చేరుకున్నాడు ఎన్టీఆర్. తన జీవితం ఇప్పటి ఎందరో యువతరానికి స్ఫూర్తి అంటూ చాలా మంది విశ్లేషకులు చెబుతారు. సినిమాల్లోకి వచ్చి ఓ మోస్తరు హిట్లు కొట్టినా కూడా నందమూరి కుటుంబం ఎన్టీఆర్ ను ఆదరించలేదు. నందమూరి కుటుంబం లో జరిగే ఏ వేడుక అయినా ఎన్టీఆర్ కూ అతని తల్లికి నో ఎంట్రీ. అలా ఉన్న పరిస్థితి ఇప్పుడు నందమూరి వారసుడు అంటే ఎన్టీఆర్ జూనియర్ అనే రేంజ్ కి తెచ్చుకున్నాడు బుడ్డోడు.

వేడుకలో రాకుండా అడ్డుకున్న తారకరత్న…
తొలి రోజుల్లో ఎన్టీఆర్ అప్పటికే మంచి హిట్లు ఇస్తున్నా కూడా నందమూరి కుటుంబంలో ఆదరన లేని సమయంలో నందమూరి కుటుంబం లో జరిగిన ఒక వేడుకకు ఎన్టీఆర్ తన తండ్రి హరికృష్ణ హోదా ద్వారా వెళ్లాలని అనుకుంటే బాబాయ్ బాలకృష్ణ తారకరత్న ను పురమాయించి పనిగట్టుకుని ఎన్టీఆర్ జూనియర్ ను అవమానించారట. ఇది ఆపట్లో మంచి హాట్ టాపిక్ గా నడిచింది. కాని ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ పెరిగింది.

ఇక ఇప్పుడు ఎన్టీఆర్ పేరును నందమూరి కుటుంబం వాడుకోవాల్సిన పరిస్థితి. ఒకానొక ఇంటర్వ్యూలో తారకరత్న ఎన్టీఆర్ ను అవమానించాల్సిన అవసరం నాకు లేదు అది ఒట్టి పుకారంటూ వివరణ ఇచ్చినా ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఇక ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్ తరువాత ఎన్టీఆర్ అంటే నేనే అంటూ అందరి మీద చిరాకుపడిన తారకరత్న మాటలు నమ్మగలమా… ఏది ఏమైనా అప్పుడు ఆ తారక రాముడు, ఇప్పుడు ఈ తారక రాముడు అభిమానుల గుండెల్లో ఉండిపోయారు నటన అభినయం లో తాత ను పనికిపుచ్చుకున్నాడు అంటూ అభిమానులు సర్టిఫికెట్ ఇచ్చాక వీళ్లందరితో పనేముంది.



























